KTR: హైదరాబాద్‍కు 09 సొల్యూషన్స్ కంపెనీ.. ప్రకటించిన కేటీఆర్..
యూఎస్‌లో ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న గ్లోబల్ సప్లై చైన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ o9 సొల్యూషన్స్ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కంపెనీ తన గ్లోబల్ క్లయింట్‌ల కోసం, R&D, సేవల డెలివరీ సామర్థ్యాన్ని విస్తరించడానికి హైదరాబాద్ ను కేంద్రంగా మార్చుకోనుందని మంత్రి ప్రకటించారు. "ఇది రాబోయే రెండేళ్లలో తెలంగాణలో 1000ల అధిక నైపుణ్యం, అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తుంది" అని చికాగోలో o9 నాయకత్వ బృందాన్ని కలిసిన తర్వాత కేటీఆర్ అన్నారు.
"తెలంగాణకు @o9solutions స్వాగతం. TASKతో కలిసి సప్లై చైన్ స్కిల్స్ అకాడమీ, తయారీ కార్యకలాపాలు విస్తరిస్తూనే ఉన్నందున యువతకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుంది" అని కేటీఆర్ అన్నారు. "అలాగే సరఫరా గొలుసు డొమైన్‌లోని గ్లోబల్ కంపెనీల కోసం మా స్థానిక ఇంజనీరింగ్ ప్రతిభకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంతో భాగస్వామ్యంతో o9 సొల్యూషన్స్ అభివృద్ధి చెందుతుందని సప్లై చైన్ స్కిల్స్ అకాడమీ గురించి థ్రిల్డ్." అని కేటీఆర్ చెప్పారు.

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె. తారక రామా రావు ఆదివారం షికాగోలో ఫుడ్ ప్రాసె సింగ్ రంగంపై అక్కడి వారిని అడికి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధుల తో పెట్టుబడులకు సంబంధించి భేటీ నిర్వహించారు. షికాగో ఫుడ్ స్టాప్‌లో ఏర్పాటు చేసిన అనేక షాపులకు కేటీఆర్ వెళ్లారు. షికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతులపైన స్థానిక వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.
షికాగో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నో వేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉందని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపైన ఆధార పడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముKల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించిందన్నారు.












Click it and Unblock the Notifications