ఎన్టీఆర్‌ని కూడా విమర్శించారు: జిల్లాలపై ఆ మాట వాస్తవమేనన్న కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల ఏర్పాటు అనుకున్న దానికంటే చిన్నవి అయిన మాట వాస్తవమేనని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను ఒకే చట్టం కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకైనా బదిలీ చేసేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ఇకపై సర్కిళ్ల వారీగా అధికారాల వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Minister ktr says plan to increase circles in Hyderabad

దీంతో సర్కిళ్ల వారీగా బదిలీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీలో సర్కిళ్లను 24 నుంచి 30కు పెంచుతామని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ మండల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి విమర్శలే వచ్చాయని తెలిపారు. నియోజక వర్గాల సంఖ్య కూడా ఖచ్చితంగా పెరుగుతుందన్నారు.

దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని, కేవలం ఇది రాజకీయ నిర్ణయమేనని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా భవనాలు కడితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో 800కు పైగా అక్రమ కట్టడాలను కూల్చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మేజర్ రోడ్స్ డివిజన్ వ్యవస్థను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

ప్రతి కుటుంబంపై కలెక్టర్‌కు అవగాహన ఉండాలని మంత్రి సూచించారు. జిల్లాల పునర్విభజన వల్ల మూడు లాభాలున్నాయని మంత్రి తెలిపారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం, రెండో స్థాయి నాయకత్వ ఎదుగుదల, పెత్తందారి వ్యవస్థ నిర్మూలనకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ఉపయోగమన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుందన్నారు. పార్లమెంట్‌లో సాధారణ మెజార్టీతో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ సాధ్యమే అని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ-హబ్‌ను టీ బ్రిడ్జి పేరుతో అమెరికాలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వైట్‌టాప్ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 25 వేల కోట్ల ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+