ఒబామా హెలికాప్టర్ విడిభాగాలు ఇక్కడే, అమెజాన్ సహా 150 సంస్థలు: కెటిఆర్
హైదరాబాద్: రానున్న కాలంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెలికాప్టర్‌కు చెందిన విడిభాగాలు కూడా హైదరాబాదులోనే తయారవుతాయని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం నాడు అన్నారు.
పారిశ్రామికవేత్తలకు తాము ఎర్రతివాచీ పరుస్తామని చెప్పారు. పదిహేను రోజుల్లో పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తామని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లో అనుమతులు లభించకుంటే అందుకు సంబంధించిన అధికారుల పైన తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వచ్చే ఆరు నెలల్లో అమెజాన్ వంటి పలు 150 ముఖ్యమైన సంస్థలు హైదరాబాదుకు వస్తున్నాయని చెప్పారు. త్వరలో హైదరాబాదులోనే బరాక్ ఒబామా హెలికాప్టర్ విడిభాగాలు కూడా తయారవుతాయని మంత్రి కెటిఆర్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
బిజెపి, టిఆర్ఎస్ తోడు దొంగలు: షబ్బీర్ అలీ
బిజెపి, టిఆర్ఎస్ తోడు దొంగలు అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. పత్తి కొనుగోళ్లు, కోచ్ ఫ్యాక్టరీల పైన రెండు ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారికి వరంగల్ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన పైన చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. తన పైన చేసిన ఆరోపణలు నిరూపించలేని స్థితిలో ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల హామీలు ఏమయ్యాయో కెసిఆర్‌ను నిలదీయాలన్నారు.












Click it and Unblock the Notifications