నాన్నమ్మ ఊరిపై ప్రేమ చాటుకున్న మంత్రి కేటీఆర్: అద్భుతంగా ప్రభుత్వ పాఠశాల
హైదరాబాద్: తన నానమ్మ ఊరిలో తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా నిర్మించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ చేసిన పనికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి కేటిఆర్ నాన్నమ్మ వెంకటమ్మ సోంతూరు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్. అయితే, గత ఏడాది మే 10 వ తేదీన కోనాపూర్‌లో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఆ సమయంలోనే తన సోంత డబ్బులతో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి తరచూ పనులను పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు.

రూ. రెండున్నర కోట్లతో ఆధునిక హంగుల ఈ పాఠశాల భవనం నిర్మించారు. దీంతో పాటుగా గ్రామంలో రూ. 10 కోట్లతో పలు అభివృద్ది పనులను కూడా ప్రారంభించారు. గ్రామానికి వెళ్లే దారిలో రూ.2.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. రూ. 75 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. అలాగే రూ. 25 లక్షలతో గ్రామ పంచాయితీ నిర్మాణం చేపట్టారు. మరో 5 కోట్లను ప్రత్యేక నిధి కింద గ్రామానికి మంజారు చేశారు మంత్రి కేటీఆర్. వీటితో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు.
My grandmother Venkatamma Garu will be pleased for sure 😊
— KTR (@KTRBRS) July 9, 2023
As promised, have completed the construction of the Government School at Konapur village of Kamareddy constituency
Will be inaugurating it soon https://t.co/OgyQxLNDtk pic.twitter.com/PA0DOzJRZD
మరోవైపు, గ్రామంలో కుల సంఘాల భవనాలు, పలు ఆలయాల నిర్మాణాలు కూడా చేపట్టారు. తాజాగా, నూతన పాఠశాల భవనానికి సంబంధించి ట్వీట్ చేశారు కేటీఆర్. నిర్మాణం పూర్తయిన బిల్డింగ్ ఫొటో, వీడియోను కేటీఆర్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వరలోనే కోనాపూర్‌కు వచ్చి నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ భవనాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్.. తన తల్లి శోభతో కలిసి విచ్చేయనున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ చొరవతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications