Telangana: త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..!

జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనుభవం, అర్హత కలిగిన జర్నలిస్టులందరికి త్వరలో ఇళల స్థలాలు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ తీసుకొస్తామని వివరించారు. వరంగల్ నగరానికి సంబంధించి నాళాలు ఆక్రమణలు తొలగిస్తామని మంత్రి చెప్పారు. అలాగే బీపీఎల్ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు లో అర్హులైన పేదలను గుర్తించాలన్నారు. అక్టోబర్ 2 న కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారని పొంగులేటి చెప్పారు. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే.. పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. త్వరలో రేషన్ కార్డులు కూడా ఇస్తామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాలను సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు పంపిణీ చేశారు. 1100 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను ఇచ్చారు.

Minister Ponguleti Srinivas Reddy said that journalists will soon be given houses

ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి పీఆర్ఓ అయోధ్య రెడ్డి కూడా ఉన్నారు. ఈ సొసైటీలోని జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు ఏళ్ల తరబడి కోర్టులో ఉండగా రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య తీరిపోయింది. అయితే అక్రిడెషన్ ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. డిజిటల్ మీడియాలో పని చేసేవారికి అక్రిడేషన్ ఇవ్వడం లేదు. దీంతో డిజిటల్ మీడియాలో పని చేసే జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంటుంది.

డిజిటల్ మీడియాలో పని చేసే జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ ఉంది. చిన్న చిన్న యూట్యూబర్లు కూడా తాము జర్నలిస్టులమని చెప్పుకుంటున్నారు. అయితే ఒక సంస్థ ఉండి.. అందులో 20కి పైగా మంది పని చేస్తూ.. వారికి పీఎఫ్ ఖాతా ఉంటే.. ఆ సంస్థ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+