ఇందిరమ్మ ఇళ్ల కోసం వేచి చూస్తున్న వారికి బిగ్ అప్డేట్..!!

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బిగ్ అప్డేట్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపుల పైన కీలక ఆదేశాలు ఇచ్చారు. క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముందుగానే గుర్తించండి మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 500 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు.

మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల పైన కీలక నిర్ణయం వెల్లడించారు. క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యమని తెలంగాణ స్పష్టం చేసారు. మూడు విడతల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్‌పై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పేదల ఉపాధికి ఆటంకం లేకుండా నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ టవర్స్ నిర్మాణానికి భూముల గుర్తింపును వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500ల ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.

బీజేపీ, జనసేనకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక- టీడీపీ మద్దతు ఎవరికి..!?
బీజేపీ, జనసేనకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక- టీడీపీ మద్దతు ఎవరికి..!?
minister-ponguleti-srinivasa-reddy-key-directions-for-housing-officials-over-indiramma-towers

అధికారులకు కీలక ఆదేశాలు

అదే విధంగా రెండో, మూడో విడతల నిర్మాణాలకు ముందుగానే స్థలాలను గుర్తిస్తున్నామని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. డ్రా ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. యూట్యూబ్‌లో ఎప్పుడైనా లబ్ధిదారుల ఎంపిక వివరాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు మంత్రి పొంగులేటి స్పష్టం చేసారు. ఒక్కో టవర్‌లో 10 ఫ్లోర్లు అంతస్తుకు 12 ఫ్లాట్లు నిర్మించేలా ప్రణాళిక చేశారు. ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను నిర్మించనున్నారు చార్మినార్, బహదూర్‌పురా, ముషీరాబాద్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించి హౌసింగ్ బోర్డు పొజిషన్‌లోకి తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+