ప్రయాణీకులకు TGSRTC తీపి కబురు, ఉచిత బస్సు ప్రయాణం ఇక..!!
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేసారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరగటంతో పాటుగా.. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక.. ఈ నెలలో జరిగే మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో ఉచిత ప్రయాణం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఇక ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడవనున్నాయి. హైదరాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రకటించారు. అందుకు తగినట్టుగా మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విజన్-2047 ఆర్టీసీ లక్ష్యానికి అనుగుణంగా బస్సులు, ఉద్యోగుల సంఖ్యను పెంచే కార్యాచరణ అమలులో భాగంగా అధికారులకు కీలక సూచనలు చేసారు. మహాలక్ష్మి పథకంతో 90కిపైగా డిపోలు లాభాల్లో ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన డిపోల్లో నష్టాలకు కారణాలపై అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. ఇక.. హైదరాబాద్ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే రానుండటంతో.. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఈ బస్సుల్లోనూ అమలుకు నిర్ణయించారు.

కాగా, ఉచిత ప్రయాణం చేసే వారికి ఆర్టీసీ స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది. ఇప్పటికే ఈ విధానం అమలు పైన తుది కసరత్తు జరుగుతోంది. ఇక.. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతరలో 50 ఎకరాల స్థలంలో ఆర్టీసీ రకరకాల ఏర్పాట్లు చేస్తోంది. మేడారం ప్రయాణ ప్రాంగణంలో 52 క్యూరైలింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 25 ప్రయాణ ప్రాంగణాలను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి 3,495 బస్సులు నడిపించేందుకు నిర్ణయించింది. ఈ బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఎక్స్‌ప్రెస్‌కు ఛార్జి రూ.600 ఉండగా గరుడప్లస్‌కు 1,110గా ఉంది. వరంగల్ నుంచి ఎక్స్‌ప్రెస్‌కు రూ.250, గరుడప్లస్‌కు రూ.500గా అధికారులు వెల్లడించారు. మహాలక్ష్మీ పథకం ఈ బస్సుల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications