Ponnam: రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిచ్చొద్దు.. కౌశిక్ రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్..!

ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎరైనా సహించేది లేదని పేర్కొన్నారు. ఇళ్ల దాడులు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి.. ప్రజలు అన్నదమ్ముల ఉంటున్నారని.. ఇలా వ్యాఖ్యలు చేయడం మంచి కాదని చెప్పారు.

వ్యక్తుల మధ్య విభేదాలను ప్రాంతాల మధ్య విభేదాలు మార్చవద్దని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోనే ఉండాలని చెప్పారు. ఎమ్మెల్యే హరీశ్ రావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాజులు, చీర కట్టుకుని తిరగాలని పాడి కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. కౌశిక్ రెడ్డి అరెకపూడి గాంధీ టార్గెట్ వ్యాఖ్యలు చేశారు.

Minister Ponnam Prabhakar said not to create differences between Telangana and Andhra Pradesh

అరెకపూడి ఇంటికెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పాడు. దీనికి ప్రతిగా.. తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారు. దీంతో చూసుకుందాం రా అని కౌశిక్ సవాల్ విసిరారు. తనకే సవాల్ విసురుతావా అని గాంధీ తనే అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత సీన్ సీపీ కార్యాలయానికి మారింది.

కౌశిక్ రెడ్డి తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు సీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దీంతో వారిని పోలీసులు పక్కకు తప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+