TSRTC: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం.. త్వరలో ఆర్టీసీలో నియామకాలు..
తెలంగాణలో ప్రస్తుతం కొలువు జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి తేదీలు వచ్చాయి. అలాగే మెగా డీఎస్సీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నడుస్తోంది. తాజాగా ఆర్టీసీలో కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. ఆర్టీసీలో త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఆర్టీసీలో ఉద్యోగుల పీఆర్సీపై కూడా తమ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 2017 ,2021 పీఆర్సీ పెండింగ్ బిల్స్ కి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ఉత్తమంగా పని చేసిన ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రానికి ఆర్టీసీ సంస్థ పునాది అని పొన్నం అన్నారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు.

ఆర్టీసీ లాస్ నుంచి లాభాల్లోకి తెవడానికి కష్టపడుతున్నట్లు వివరించారు. ఆర్టీసీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం, ఎన్నికల కోడ్ కారణంగా ఆర్టీసీ బకాయిల చెల్లింపుపై ప్రభావం చూపాయన్నారు. త్వరలోనే బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు మహాలక్షి పథకం పేరు అవార్డు ఇస్తామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు రూ. 280 కోట్ల బాండ్స్ ప్రకటించారని గుర్తు చేశారు. అవి కూడా రెండు మూడు రోజుల్లో పేమెంట్స్ విడుదలవుతాయని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు. తెలంగాణలో మహిళ ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలు బస్సుల్లో భారీగా ప్రయాణం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications