గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితాఇంద్రారెడ్డి భేటీ.. యూనివర్సిటీల ఉమ్మడి నియామక బిల్లుపై చర్చలో జరిగిందిదే!!
యూనివర్సిటీల ఉమ్మడి నియామక బిల్లుపై తనకున్న సందేహాలను నివృత్తి చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా, గవర్నర్ తమిళిసై తో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రితో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ కు సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.

యూజీసీ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్న గవర్నర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ బిల్లుపై తనకు ఉన్న సందేహాలను సబితా ఇంద్రా రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరమని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. నిష్పాక్షిక పద్ధతిలో వీలైనంత త్వరగా రిక్రూట్మెంట్ చేపట్టాలని గవర్నర్ తమిళిసై సూచించారు. అర్హత ఆధారిత రిక్రూట్మెంట్ నిర్వహించాలని కోరారు. అంతేకాదు యూనివర్సిటీ అధ్యాపకుల నియామకంలో యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అభ్యర్థుల సందేహాలను పరిష్కరించాలని తెలిపారు.

యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలపై గవర్నర్ సూచనలు
ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు కు సంబంధించిన సమస్యలతో పాటుగా, యూనివర్సిటీలో సౌకర్యాలను మెరుగుపరచడం పై కూడా దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో మెరుగైన వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలలో లైబ్రరీ సౌకర్యాలను మరింత మెరుగు పరచాలి అన్నారు. డిజిటల్ వనరులను కూడా ప్రాధాన్యత ప్రాతిపదికన మెరుగు పరచవలసిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఛాన్స్ లర్ కనెక్ట్ కార్యక్రమంతో పూర్వ విద్యార్థులతో వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

న్యాయపరమైన చిక్కులు లేకుండా నియమాక ప్రక్రియ జరగాలన్న గవర్నర్
గవర్నర్ తమిళిసై సౌందరాజన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల అమలు, న్యాయపరమైన అంశాలు, రిజర్వేషన్ విషయాల పై గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన ఉద్దేశం త్వరితగతిన నియామకాలు చేపట్టాలని, ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నియామక ప్రక్రియ కొనసాగాలని మాత్రమేనని పేర్కొన్న గవర్నర్, ఆ విధంగా యూనివర్సిటీలలో ఖాళీలను ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కాకుండా భర్తీ చేయాలన్నారు.

అన్ని నిబంధనలు పాటిస్తున్నామని తెలిపిన సబితా ఇంద్రారెడ్డి
ఇక గవర్నర్ తమిళిసైతో అన్ని నిబంధనలు పాటిస్తున్నామని సబితా ఇంద్రా రెడ్డి,అధికారులు తెలిపారు. ఏ విధమైన న్యాయ సమస్య రాదని పేర్కొన్నారు. ఉమ్మడి బోర్డు ద్వారా చేపట్టే రిక్రూట్మెంట్ ప్రక్రియ లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుత విధానంలో ఇబ్బందులను గురించి వివరించిన అధికారులు, అన్ని విధాలుగా ఆలోచించిన తరువాతనే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టడం జరిగిందని వెల్లడించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications