వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులతో కబడ్డీ ఆడిన మంత్రి సత్యవతి రాథొడ్, ఎంపీ మాలోతు కవిత

|
Google Oneindia TeluguNews

సమస్యలతో ఎప్పుడూ ప్రజా ప్రతినిధులు బిజీగా ఉంటారు. నిత్యం బిజీ బిజీగా గడుపుతారు. క్షణం తీరిక ఉండదు. ఆదివారం రోజు కూడా ఏదో పని ఉంటుంది. రేపు (సోమవారం) చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని విద్యాసంస్థలు ఆటల పోటీలు నిర్వహించారు. అందులో మంత్రి, ఎంపీ కూడా పాల్గొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది.

మంత్రి సత్యవతి రాథొడ్, ఎంపీ మాలోతు కవిత ఆదివారం భద్రాచలం గిరిజన గురుకాల పాఠశాలకు వచ్చారు. వారితో ఉత్సాహంగా కబడ్డీ ఆడారు. వారిద్దరూ ఆడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆటల పోటీలు ప్రారంభించి.. సరదగా ఆడేశారు. తర్వాత విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. చక్కగా చదువుకోవాలని సూచించారు. పేరంట్స్, టీచర్స్‌కు మంచి పేరు తీసుకురావాలని అడిగారు.

minister Satyavathi Rathod and mp kavitha play kabaddi to students

రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అభివృద్దిని గుర్తు పెట్టుకోవాలని విద్యార్థులకు మంత్రి సత్యవతి రాథోడ్ సూషించారు. ఆ మేరకు రాణించాలని వారికి హితబోధ చేశారు. గురుకులాల్లో మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని గురుకులాలు లేవని చెప్పారు. అందరికీ నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.

minister Satyavathi Rathod and mp kavitha play kabaddi to students

మంత్రి, ఎంపీ తమ వద్దకు వచ్చి, గడపడంపై స్టూడెంట్స్ ఆనందంగా ఉన్నారు. వారితో చక్కగా ఆడి, తమ జీవిత లక్ష్యాలను వివరించారు. తర్వాత హాస్టల్, తరగతి గదులను మంత్రి, ఎంపీ కలిసి సందర్శించారు. ఫుడ్ ఎలా పెడుతున్నారని వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు.

English summary
telangana minister Satyavathi Rathod and mp kavitha play kabaddi to bhadrachalam gurukul students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X