మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన నిర్ణయం - గెలిచే వరకూ ఇంతే..!!

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. వచ్చే ఏడాది ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ఇప్పుడు మునుగోడు సెమీస్ గా మారింది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూనే లోలోపల టెన్షన్ పడుతున్నాయి. ఇక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమనే ధీమాతో ఉన్న సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన చేసారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

ఇటు మంత్రులు ప్రస్తుతం మనుగోడులో పార్టీ గెలుపు కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో మంత్రి సత్యవతి రాథోడ్ కీలక నిర్ణయం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి..ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసే వరకూ తాను తాను చెప్పులు లేకుండానే తిరుగుతానంటూ ప్రతిజ్ఞ చేశారు. గత నెలలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ కేంద్రంగా జరిగిన సభలో గిరిజనులకు రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో ఇస్తానని ప్రకటించారు. ఆ సమయంలోనే సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కుే పాదాభివందనం చేసారు.

Minister Satyavathi Rathod Sensational decision in supprt of KCR

ఆ వేదిక నుంచే తాను చెప్పులు ధరించకూడదని నిర్ణయం తీసుకొని..అక్కడే చెప్పులు ధరించటం మానేసానని మంత్రి వెల్లడించారు. గిరిజనుల మద్దతు సీఎం కేసీఆర్ కు ఉంటుంని..వారి ప్రతినిధిగా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఎన్నికలు పూర్తయి..కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే వరకూ ఏ కాలంలో అయినా..ఎక్కడైనా చెప్పులు లేకుండానే తిరుగుతానని మంత్రి స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉన్న అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+