స్మితా సభర్వాల్‌ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క

ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. వికలాంగ సోదరులను కించపరిచే వ్యాఖ్యలని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మంత్రి సీతక్క ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందన్నారు. ఆమెకు ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు.

తను అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఒక అధికారి ఫిజికల్‌ ఫిట్​నెస్‌ గురించి స్మితా సభర్వాల్‌ స్పందించడం తప్పుగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఉద్యోగాలకు ఆఫీసులో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకుని మాట్లాడాలని స్మితా సభర్వాల్‌కు హితవు పలికారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు సీఎం దృష్టికి వెళ్లి ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Minister Seethakka fires at Smita Sabharwal tweet on Disability Quota

తాను కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. ఫిజికల్ ఫిట్​నెస్ అనేది దేవుడు ఇచ్చేదని ఐఏఎస్, ఐపీఎస్​ పని వేరని పేర్కొన్నారు. అనాదిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకోవాలన్నారు. అంగవైకల్యంతో ఎంతోమంది గొప్ప స్థానాలకు వెళ్లారని గుర్తుచేసిన మంత్రి.. ఇతరుల సమర్ధత గుర్తించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందని సీతక్క ఘాటుగా స్పందించారు.

స్మితా సభర్వాల్ ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, స్మితా సభర్వాల్‌పై సీఎస్​బీ ఐఏఎస్​ అకాడమీ ఛైర్మన్ బాలలత ఇబ్రహీంపట్నం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగులందరికీ స్మితా సభర్వాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్స్​‌లో ఆమె పెట్టిన ట్వీట్​ తొలగించకపోతే అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం బాలలత స్మితా సభర్వాల్‌​కు ఇద్దరం సివిల్ పరీక్షలు రాద్దాం అంటూ సవాల్​ విసిరారు.


ఈ క్రమంలో స్పందించిన స్మితా సభర్వాల్..​ సివిల్స్ పరీక్ష రాసేందుకు మళ్లీ తాను సిద్ధమేనని, కానీ వయో పరిమితి దాటినందున పరీక్ష రాసేందుకు యూపీఎస్సీ అనుమతిస్తుందా? అనే అనుమానం ఉందన్నారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందిన బాలలతకు ఆ జాబ్, ఫీల్డ్ వర్క్‌​తో ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడిందా? లేక కోచింగ్ కేంద్రం నడపడానికా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+