పెద్ద దిక్కంటూ జీవన్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపులు: ఎమ్మెల్సీ ఏమన్నారంటే?

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేపథ్యంలో ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం జరిగింది. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్.. ఆయనను బుజ్జగించే పనిలో పడింది.

మొదట ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్.. జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయణ్ను బుజ్జిగించే ప్రయత్నం చేశారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ నుంచి జగిత్యాలకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Minister Sridhar Babu meets MLC Jeevan Reddy over resign issue

ఎలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశాలపై జీవన్‌రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు.. సావధానంగా వివరించినట్లు తెలిసింది. మంత్రి శ్రీధర్‌బాబు రాక గురించి తెలియగానే పెద్దసంఖ్యలో జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నకాంగ్రెస్ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 'మేమందరం కూడా ఆదివారం జరిగిన ఎమ్మెల్యే సంజయ్​ పార్టీ చేరిక విషయంలో పెద్దలు జీవన్​ రెడ్డి మనస్థాపానికి గురయ్యారని తెలుసుకున్నాం. అందుకే మేమంతా వచ్చి ఆయణ్ను కలిశాం. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్​ పక్షాన నిలిచి, పెద్ద దిక్కుగా జీవన్​ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. జీవన్ రెడ్డి అసంతృప్తిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్​, దీపాదాస్‌ మున్షి, మల్లిఖార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు తెలిపారు. జీవన్ రెడ్డి సీనియర్ నేత అని, ఆయనకు హామీ ఇచ్చేంత పెద్దవారిమి కాదని మంత్రి అన్నారు.

మరోవైపు, 40 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు కనీసం సమాచారం లేకుండా బీఆర్ఎస్ నేతను పార్టీలో చేర్చుకోవడంతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని జీవన్ ​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామన్నారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారన్న విషయం తెలియగానే కాంగ్రెస్‌ అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో నేతలు, మంత్రులు జీవన్ రెడ్డిని కలిసి తొందరపడవద్దని కోరారు. పార్టీ నియమ నిబంధనల్ని పాటిస్తానని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+