నీటి పారుదల శాఖలో భారీప్రక్షాళన: కీలక అధికారిపై వేటు, ఈఎన్సీ జనరల్ రాజీనామాకు ఉత్తమ్ ఆదేశం
నీటి పారుదల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు చేపట్టింది. రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈఎన్‌సీ జనరల్ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మరికొందరు ఇంజినీర్లపైనా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను విజిలెన్స్ అధికారులు అందించారు. కాగా, గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుంది.

అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నీటి పారుదల శాఖలో కీలక అధికారులపై చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగుతున్న ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశారు.
రామగుండం ఈఎన్సీగా ఉండటంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు, పంప్ హౌస్‌లకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్న వెంకటేశ్వర్లును సర్వీసును తొలగిస్తూ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక, రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్షపార్టీల సభ్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications