Tours: టూర్లకు వెళ్తోన్న మంత్రులు, ఎమ్మెల్యేలు..
లోక్ సభ ఎన్నికలు ముగియడంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు టూర్లకు వెళ్తున్నారు. ఎన్నికల్లో బిజీగా గడిపిన వారు ప్రశాంతత కోసం విహార యాత్ర, తీర్థయాత్రలకు వెళ్తోన్నారు. కుటుంబంతో కలిసి హాయ్ గా గడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు దాదాపు 20 రోజులు ఉండడంతో సరదాగా గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి కొందరు దైవ దర్శనానికి వెళ్తోన్నారు. మంత్రి పొంగులేటి మంగళవారం శబరిమలై వెళ్లారు.
మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు కూడా శబరిమలై బయల్దేరారు. వీరంతా ఎక్కిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో గంటకు పైగా ఎయిర్ పోర్టులో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది బడ్డారు. రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మంగళవారం అమెరికాకు వెళ్లారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మంగళవారం సరదాగా గడిపారు. యాక్టివ బండిపై అల్లుడిని ఎక్కించుకుని నగరంలో తిరిగారు. ఓ బేకరికి వెళ్లారు. చాలా మంది అభిమానులు బండితో కలిసి ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన బంధువులు, పిల్లలతో సరదాగా గడిపారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు.
ఎన్నికల ఫలితాలకు రెండు మూడు రోజుల ముందు మళ్లీ స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది. అటు ఏపీ సీఎం జగన్ దంపతులు తమ కూతురిని చూడడానికి లండన్ వెళ్లనున్నారు. ఫలితాల నాటికి తిరిగి రానున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications