'మనసున్న సీఎం కేసీఆర్', 'పేదల ఆకలి తీర్చిన మహానేత కేసీఆర్'
హైదరాబాద్: దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, పద్మారావు తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా పేదవాళ్ల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టించడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ అధ్బుతమైన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.

తల్లీ, తండ్రి, కూతురు, కొడుకు అందరూ ఒకే ఇంట్లో నివసించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారన్నారు. ఇప్పుడే ప్రారంభించిన ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది హైదారాబద్‌లో 10 వేళ ఇళ్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది 20వేల ఇళ్లు, ఆలా రాబోయే నాలుగేళ్లలో లక్ష ఇళ్లను పేదవాళ్లకు కట్టించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని చాలా ప్రశ్నించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే రూ. 1000 ఫించన్, సీఎం మనవడు తినే సన్న బియ్యాన్నే పేదవిద్యార్ధులు తింటున్నారని గుర్తు చేశారు.
పేద వారికి ఆరు కిలోలు బియ్యంతో పాటు దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఆడపిల్ల పుడితే ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల కోసం కళ్యాణ లక్ష్మీ, పేద ముస్లింల కోసం షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకటిమయం అవుతుందన్న కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయ జీవితమే చీకటిమయమైందన్నారు. భవిష్యత్తులో రెప్పపాడు కూడా కరెంటు పోదన్నారు. జలాశయాలన్ని ఎండిపోయినా సీఎం కేసీఆర్ ముందు చూపుతో కృష్ణా, గోదావరి నీటితో హైదరాబాద్ దాహం తీరుస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లడుతూ నిరుపేదలు కూడా మంచి ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిస్తున్నారన్నారు. గంగిరెడ్డి ఎల్లయ్యదొడ్డి, వక్స్‌బోర్డులో పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. స్వరాష్ట్రంలో పేదల ఆకలి తీర్చిన మహానేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రూ. వెయ్యి పెన్షన్లతో వృద్ధులకు, వితంతువులకు, గీతకార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు.
అంతక ముంద కవాడిగూడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పద్మారావు మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో పేదల స్వప్నం సాకారమైందన్నారు. జంట నగరాల్లో లక్ష ఇళ్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. పేదల సుఖసంతోషాలతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు.












Click it and Unblock the Notifications