హైటెక్ రైల్వే స్టేషన్- పేరుకు తగ్గట్టే..!!
Hitech Railway Station: ఐటీ హబ్ హైటెక్ సిటీకి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఇక్కడి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమృత్ భారత్ కింద తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్.. వంటి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. మొదటి విడతలో ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది.
ఇప్పటికే సికింద్రాబాద్, యాదాద్రి, బేగంపేట్ వంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. 718 కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మూడు దశల్లో ఇవి పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మితం కానుంది.
అదే క్రమంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులూ చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకు 72 శాతం పనులు పూర్తయ్యాయి. స్టేషన్ ఎంట్రీ ర్యాంప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్ పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవన సముదాయం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సర్కులేటింగ్ ఏరియా నిర్మాణం సాగుతోంది. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మితం కానుంది.
🚉Redevelopment of Hitech City Railway Station, Telangana
— Ministry of Railways (@RailMinIndia) March 20, 2025
Physical Progress: 72%
✅Work Completed:
-Entry Ramp
-Foot Over Bridge launch
Ongoing work:
-Station Building
-12m FOB & Circulating Area
-Lift & Escalator
-Platform Resurfacing #AmritStations pic.twitter.com/9tr2GNnhSf
లిఫ్ట్, ఎస్కలేటర్ సైతం అందుబాటులోకి రానుందీ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో. కాచిగూడ, సికింద్రాబాద్ తరహాలో ఎస్కలేటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనుంది. ప్లాట్‌ఫామ్ రీసర్ఫేసింగ్ పనులు కొనసాగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేశారు.
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications