ఆమె ఇంటర్.. అతడేమో తొమ్మిది.. కానీ వారికో బిడ్డ !!
తెలిసి తెలియని వయసులో కొందరు చేస్తున్న పిచ్చి పనులు వారికే కాకుండా వారి కుటుంబానికి సైతం మాయని మచ్చని తీసుకొస్తున్నాయి. నిండా పద్దెనిమిది ఏళ్లు కూడా లేని జంట ప్రేమలో పడడం.. మేజర్లు కాకుండానే ఏకంగా తల్లిదండ్రులు కావడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అనూహ్య ఘటనలో బాలుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. బాలిక ఇంటర్ చదువుతుంది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడ జరిగిందంటే..
వనపర్తి మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు.. అదే ఊరులో ఇంటర్‌లో చదువుతున్న బాలిక మధ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పలుమార్లు శారీరకంగా దగ్గరవ్వగా.. బాలిక గర్భవతి అయింది. బాలికకు గర్భం వచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇద్దరూ మైనర్లు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలకు సమాయత్తమవుతున్నారు. కానీ ఇంతలోనే బాలిక నవంబర్ 14వ తేదీన శిశువుకు జన్మనివ్వడంతో విషయం గ్రామమంతా హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టగా.. బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకుకు ఎలాంటి సంబంధం లేదంటూ వాగ్వాదానికి దిగడంతో ఇరు కుటుంబాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తతకు తెరలేపింది. మరోవైపు కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బాలిక కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు సమర్పించారు. శిశువు తండ్రిని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష చేయాలని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అయితే ఇద్దరూ మైనర్లు కావడంతో ఇది స్పెషల్ పోక్సో చట్ట పరిధిలోకి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటన పట్ల గ్రామస్తులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో రీసెంట్ గానే 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమ పేరుతో విజయవాడలోని ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. మహా నగరం అయిన హైదరాబాద్ వచ్చి ఏకంగా ఇల్లు అద్దెకు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు వారి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించి విజయవాడకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయ్యింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications