కెసిఆర్ ఆయుత చండీయాగం అగ్నిప్రమాదం, కుటీరాలు పీకేసిన పోలీసులు
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో ఆదివారం నాడు స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. విరామ సమయంలో యాగశాలలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. హోమగుండం నుంచి వచ్చిన అగ్నితో కుటీరానికి మంటలు అంటుకుని ప్రమాదం సంభవించింది.
వెంటనే స్పందించిన ఫైరింజన్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం సంభవించిన వెంటనే యాగశాలలోని వారంతా బయటకు పరుగెత్తుకు వచ్చారు. యాగశాల పైకప్పు గడ్డితో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
యాగశాల వద్ద ఉన్న పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు సహాయచర్యలను పర్యవేక్షించారు. కాగా, తుది రోజున సంపూర్ణ పూర్ణాహుతికి ముందు యాగశాల పైకప్పు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే, యాగం విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఘోర దుర్ఘటన తప్పినట్లయింది.

మరో గంటలో దేశ ప్రధమ పౌరుడు యాగానికి రానుండగా ఈ ఘటన జరగడం కలకలం రేపింది. యాగ క్రతువులో భాగంగా ఉదయం నుంచి కిలోల కొద్దీ కర్పూరం, ఆవు నెయ్యిని 101 భారీ హోమగుండాల్లో వేసిన రుత్వికులు, విరామం కోసం లేచిన సమయంలో యాగ మండపంలోని ఓ హోమ గుండంలో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా లేచిన మంట పైకప్పుదాకా పాకి అంటుకుంది. పైకప్పును వరిగడ్డితో నిర్మించడంతో క్షణాల్లోనే మంటలు పాకాయి. పైనుండి మంటలంటుకున్న గడ్డి కిందపడ్డాయి. మంటలను ఎట్టకేలకు అదుపులోకి తెచ్చారు.
ప్రమాదం సమయంలో... ఎక్కువమందిని రక్షించే దిశగా భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేసింది. అంతకుముందు వేసిన తాత్కాలిక గోడలను ధ్వంసం చేసి... రుత్వికులు, నిర్వాహకులు వేగంగా బయటకు వచ్చేలా చూశారు. ఈ క్రమంలో పలు తాత్కాలిక నిర్మాణాలను పీకేసి మార్గాలను ఏర్పాటు చేశారు. వాటిని పీకేశారు. కాగా, ఎవరీకి ప్రాణాపాయం జరగలేదు. అయితే, కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications