వయసులో చిన్నదే.. కానీ చుక్కలు చూపించింది: 'అస్మా' కేసు ఛేదించిన పోలీసులు..
చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో తప్పిపోయినట్లుగా తిరుగుతున్న ఓ బాలికను.. స్థానిక యువకులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
హైదరాబాద్: వయసులో చిన్నదే అయినా.. తన అబద్దాలతో ఓ బాలిక పోలీసులనే బురిడీ కొట్టించింది. బాలిక చెప్పిన కట్టు కథలకు పోలీసులే గందరగోళానికి గురయ్యారు. చివరకు బాలిక అబద్దాలు చెబుతోందని గుర్తించిన పోలీసులు.. కేసును త్వరగానే చేధించారు.
వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో తప్పిపోయినట్లుగా తిరుగుతున్న ఓ బాలికను.. స్థానిక యువకులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీసులు బాలికను పలు విషయాలపై ఆరా తీయగా.. తనను పుణే నుంచి తీసుకొచ్చిన కొంతమంది చాంద్రాయణ గుట్టలో వదిలిపోయారని చెప్పింది.

దీంతో పోలీసులు దినపత్రికల్లో బాలిక మిస్సింగ్ ను ప్రచురించారు. బాలిక కుటుంబ సభ్యులు సంప్రదించాల్సిందిగా ప్రకటన ఇచ్చారు. ప్రకటన చూసిన బాలిక నాయనమ్మ వహీదా శుక్రవారం చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది. బాలికను అస్మాగా గుర్తించారు.
నిజానికి బాలిక స్వస్థలం పుణే అయినప్పటికీ.. ఇంట్లోంచి తరుచూ పారిపోతోందనే ఉద్దేశంతో.. ఆమె తండ్రి హనీఫ్ షేక్ పాతబస్తీ శివారు వెంకటాపూర్‌లో ఉన్న బాలిక నాయనమ్మ వహీదాబేగం ఇంటికి 15 రోజుల క్రితం అస్మాను పంపించాడు. అయితే పారిపోయే అలవాటున్న ఆ బాలిక.. యథావిధిగా నాయనమ్మ ఇంటి నుంచి కూడా పారిపోయి బయటకు వచ్చింది.
చాంద్రాయణగుట్టలో బాలిక తచ్చాడుతుండగా.. స్థానికులు ఆమె తప్పిపోయినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎట్టకేలకు అస్మా ఆచూకీ దొరకడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications