మైనర్ బాలికపై హోటల్ గదిలో లైంగికదాడి, పెళ్లి చేసుకుంటానని చెప్పి పుణ్యక్షేత్రంలో పాడుపని..

మోస పోయేవారు ఉంటే.. ఛీట్ చేసే వాళ్లు పుట్టుకొస్తుంటారు. ఇందులో సందేహానికి తావులేదు. ఓ మైనర్ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. లైంగికదాడి చేసి వదిలేశాడో ప్రబుద్దుడు. పుణ్యక్షేత్రం తిరుపతిలో పెళ్లి చేసుకుందామని చెప్పి తీసుకెళ్లి.. హోటల్ గదిలో లైంగికదాడికి తెగబడ్డాడు. పెళ్లికి ముందు వద్దని చెప్పినా.. వినిపించుకోలేదు. తీరా మోజుతీరాక వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పేరెంట్స్ వద్దకొచ్చి జరిగిన అన్యాయాన్ని వివరించింది.

 ప్రేమ పేరుతో..

ప్రేమ పేరుతో..

హైదరాబాద్ బంజారాహిల్స్ పక్కనగల బస్తీలో 16 ఏళ్ల మైనర్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. అక్కడే ఓ యువకుడు ఉండేవాడు. ఇంకేముంది ఆమె వెంటపడటం ప్రారంభించాడు. అయితే బాలిక ఫ్రెండ్స్‌కు బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం.. వారు గొప్పలు చెప్పుకోవడంతో.. తన వెంట పడుతోన్న యువకుడితో బాలిక మాట్లాడటం ప్రారంభించింది. దీనిని ఆ యువకుడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమె బలహీనతను క్యాష్ చేసుకున్నాడు.

మాటలు కలిపి..

మాటలు కలిపి..

మెల్లిగా పేరు ఏంటీ అంటూ ప్రారంభించాడు. ఫోన్ నంబర్ తీసుకొని మాటా మాటా కలిపాడు. నువ్వంటే ఇష్టం అని ప్రేమ మైకంలో దించాడు. అలా క్రమంగా తిరగడం ప్రారంభించారు. పెళ్లి చేసుకుంటావా అంటే ఓకే అని చెప్పేవాడు.. పెళ్లికి పెద్దలు అంగీకరించరని చెబితే.. గుడిలో చేసుకుంటానని చెప్పేవాడు. దీంతో ఆ యువకుడిని ఆమె పీకల్లోతు వరకు నమ్మింది. అయితే ఒకరోజు వీరి వ్యవహారం యువతి తండ్రికి తెలిసింది. ఇంకోసారి అబ్బాయితో కనిపిస్తే అంతే సంగతులు అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో యువతి భయపడింది. అతనికి దూరంగా ఉంది.

పెళ్లి చేసుకుందాం అని చెప్పి..

పెళ్లి చేసుకుందాం అని చెప్పి..

అలా నాలుగురోజులు గడిచాయి. కానీ యువతి మాత్రం మాట్లాడటం లేదు. ఏంటీ మాట్లాడటం లేదు అని అడిగితే.. జరిగిన విషయం షేర్ చేసుకుంది. అవునా.. ఇలాగైతే పెళ్లి జరగదని.. తిరుమల వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. పవిత్ర పుణ్యక్షేత్రంలో పెళ్లి.. అది తాను ప్రేమించిన వాడితో అని యువతి అంగీకరించి వెళ్లిపోయింది. అలా వెళ్లడమే యువతి చేసిన తప్పయిపోయింది. తిరుపతిలో దిగాక ఒక హోటల్‌‌లో దిగిపోయారు.

హోటల్ రూమ్‌లో లైంగికదాడి..

హోటల్ రూమ్‌లో లైంగికదాడి..

హోటల్ గదిలో ఇద్దరూ.. ఏకంతంగా ఉన్నారు. ఇంకేముంది దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. యువతిపై లైంగికదాడి చేశాడు. పెళ్లికి ముందే వద్దు అంటే.. రూపు పెళ్లి అని చెప్పి లొబరచుకున్నాడు. తర్వాత కూడా తిరుమలకు తీసుకెళ్లాక.. తిరుపతి చుట్టుపక్కల ఉన్న పార్కులు, ఇతర చోట్లకు తిప్పాడు. తిరిగి హోటల్ గదికొచ్చాక.. మరోసారి లైంగికదాడి చేశాడు. వద్దని చేబితే రేపు పెళ్లి పక్క అని చెప్పాడు.

Recommended Video

    Yes Bank Crisis : TTD Withdrew ₹1300 Crore From YES Bank Recently | Oneindia Telugu
     మోజుతీరాక..

    మోజుతీరాక..

    మరునాడు నిద్రలేసి చూస్తే.. యువకుడు కనిపించలేదు. దీంతో యువతి మోసపోయానని గ్రహించింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే హైదరాబాద్ వచ్చేసింది. ఇంటికొచ్చి జరిగిన విషయం పేరెంట్స్‌కు చెప్పింది. తల్లిదండ్రులు యువకుడిపై కేసు పెట్టారు. మొబైల్ నంబర్ ఆధారంగా యువకుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+