మైనర్ బాలికపై నాలుగు నెలలుగా రేప్: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

నిజామాబాద్/ హైదరాబాద్: ఓ మైనర్ బాలికపై నాలుగు నెలలుగా ఇద్దరు కిరాతరకులు అత్యాచారానికి పాల్పడుతున్న విషయం మంగళవారం వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకువచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలం నల్లూరు గ్రామానికి చెందిన పదిహేను సంవత్సరాల బాలిక బుస్సాపూర్ హైస్కూల్‌లో 7వతరగతి చదువుతోంది.

ఆ బాలికకు వరుసకు బావ అయిన రేపుల రాజు, అతని స్నేహితుడు బలరాంలు కలిసి ఆ బాలికను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని పాఠశాలలో దించుతామంటూ నమ్మబలికి మార్గమధ్యలోని పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించిన పురాతన భవనంలోకి తీసుకెళ్లి తమ వాంఛ తీర్చుకునేవారు.

ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు బాలికను నిలదీయగా అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో రాజు, బలరాంలపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసునమోదు చేశారు.

Minor girl raped for four months in Nizamabad district

హైదరాబాద్ నగరంలో చైన్‌స్నాచర్లు మంగళవారం రెచ్చిపోయారు. ఉదయం సమయంలో ఫిలింనగర్, సంజీవరెడ్డి‌నగర్ ఏరియాలో మూడు చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి దాదాపు పది తులాల బంగారు గొలుసులను ఎత్తుకెళ్లారు.

మధ్యాహ్న సమయంలో కూకట్‌పల్లిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్ నెం 2లో ఓ మహిళ మెడలోంచి రెండు తులాల గొలుసును లాక్కెళ్లారు. అదే విధంగా ధర్మారెడ్డి కాలనీలో కూడా మరో మహిళ మెడలోంచి తులంన్నర బంగారు గొలుసును కూడా లాక్కెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం వరకు నగరంలో మొత్తం ఐదుచోట్ల చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+