హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా అభివృద్ది చెందుతోంది. నగరంలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. అలాగే బయో సైన్స్, లైఫ్ సైన్సెస్ రంగాలు, ఫార్మా రంగాలకు భాగ్యనగరం ముఖ్య వేదికగా నిలుస్తోంది. దీంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణం, భద్రత నేపథ్యంలో ఈ నగరాన్ని ఎంచుకుంటున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో భాగ్య నగరంలో రద్దీ పెరుగుతోంది.
అయితే నిత్యం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలుతో ప్రజల రవాణా సమయాన్ని తగ్గించిన ప్రభుత్వం.. నగరంలో అవసరమైన చోట ఫ్లై ఓవర్లు, కేబుల్ బ్రిడ్జ్ లు, స్కై వాక్ లు, మల్టీ లెవెల్ పార్కింగ్ లను ఏర్పాటు చేస్తోంది. ఇక హైదరాబాద్ అంటే గతంలో చార్మినార్ నే చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హైదరాబాద్ అంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూపిస్తున్నారు. ఈ బ్రిడ్జి రాకతో వాహనాల రద్దీ తగ్గింది.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అత్యద్భుతమైన నిర్మాణమే కాకుండా పర్యాటక ప్రదేశంగానూ ఉంది. ఈ కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి వల్ల జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ ప్రయాణ సమయం 10 నిమిషాలకు తగ్గింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. వీకెండ్స్ లో ఈ బ్రిడ్జిపై రంగు రంగుల లైటింగ్, లేజర్ షో పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

అయితే ఇప్పుడు హైదరాబాద్ లో రెండో కేబుల్ బ్రిడ్జిని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. మీర్ అలాం ట్యాంక్ వద్ద ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 430 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ వంతెన పొడవు దాదాపు 2.65 కిలోమీటర్లు, అలాగే 22.2 వెడల్పుతో ఉంటుంది. ఈ బ్రిడ్జి చింతల్ మెట్ నుంచి బెంగళూరు హైవేను కలుపుతుంది. నాలుగు లేన్లుగా ఈ కొత్త కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ మేరకు త్వరలోనే శంకుస్థాపన జరగనుంది.
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications