అంకుల్! నేను మిస్టర్ ఫర్‌ఫెక్ట్-అమృతను మహారాణిలా..: ప్రణయ్ డైరీలో ఏముందంటే?
నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ రాసుకున్న డైరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమృతను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, ఆమెను బాగా చూసుకుంటున్నానని ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది.
Recommended Video


అంకుల్.. నేను..
అంతేగాక, అమృత తండ్రిని ఉద్దేశించి కూడా ఆ డైరీలో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించినట్లు తెలిసింది. ‘అంకుల్ నేను మిస్టర్ ఫర్‌ఫెక్ట్.. మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే ఫర్‌ఫెక్ట్ లక్షణాలు ఏవి ఉండాలని కోరుకుంటున్నారో.. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి' అని పేర్కొన్నట్లు సమాచారం.

అమృతను మహారాణిలా..
ప్రణయ్‌కి డైరీ రాసే అలవాటు ఉండటం వల్ల తాను అమృతను ప్రేమించిన విషయాలు రాసుకున్నట్లు తెలిసింది. కులం, ఆస్తిపాస్తులు చూసి ప్రేమికులను విడదీయరాదని, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే అని ప్రణయ్ డైరీలో రాసుకున్నట్లు సమాచారం. మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానని ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది.

నా బిడ్డను చంపరని లేదు.. అమృత
ఇది ఇలా ఉండగా, తనకు బిడ్డ పుట్టేలోగా తన భర్త ప్రణయ్‌ను హత్య చేసిన వారికి కఠిన శిక్షపడాలని అన్నారు అమృత. ‘ప్రణయ్‌ని చంపినవాళ్లు నా బిడ్డను చంపరని లేదు. బేబీ పుట్టే లోపు ప్రణయ్‌ని చంపినవాళ్లను ఉరితీస్తే బెటర్' అని అమృత వ్యాఖ్యానించారు.

పాఠశాల నుంచే ప్రేమ.. ఇలా చూస్తాననుకోలేదు..
‘మేము పాఠశాల నుంచి ప్రేమించుకున్నాం. మా విషయాలు ఇంట్లో వారందరికీ తెలుసు కానీ, మా డాడీ, బాబాయి ప్రణయ్‌ని బెదిరించారు. నన్ను ఎన్నో పర్యాయాలు కొట్టారు. నన్ను చంపి సాగర్‌లో వేస్తామని కూడా చెప్పారు. ప్రణయ్‌ని హత్య చేసిన సమయంలో ఉన్న సీసీ ఫుటేజీని ధైర్యం లేక ఇప్పటివరకు చూడలేదు. ఈరోజే సీసీ ఫుటేజీ చూశాను. ప్రణయ్‌ని కళ్లముందే చంపివెళ్లారు. అలా నేను చూస్తానని అనుకోలేదు. మా డాడీ లాంటి సైకోలు చాలా మంది ఉంటారు. 60ఏళ్లు ఉన్న వారికి కూడా భర్త చనిపోతే ఎంతో బాధ ఉంటుంది. కానీ, 21ఏళ్లు నాకు ఎంత బాధ ఉంటుంది?' అని అమృత కన్నీరుపెట్టుకున్నారు. తన బిడ్డను ప్రణయ్ ప్రతిరూపంగా చూసుకుంటానని చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications