అదృశ్యమైన మహిళ మహారాష్ట్ర కొండల్లో శవమై తేలింది...

ఆమె ట్రెక్కర్, మారథానర్. హైదరాబాద్‌లో అదృశ్యమైన ఆమె మహారాష్ట్రలో శవమై తేలింది. ఆమె ఎలా మరణించిందనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ట్రెక్కర్, మారథనర్ మహారాష్ట్రలో శవమై తేలింది. రచిత గుప్తా కనోడియా అనే ఆ మహిళ హైదరాబాదు నుంచి కనిపించకుండా పోయింది. ఆమె శవం రాయగడ్ జిల్లాలోని పన్వేల్ తాలూక్ పోలీసు స్టేషన్ పరిధిలోని పర్వత ప్రాంతంలో కనిపించింది.

ప్రమాదవశాత్తు ఆమె మరిణించి ఉంటుందని, ఎత్తు నుంచి జారి పడి ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రూప్‌తో ఆమె ట్రెక్కింగ్‌కు వెళ్లిందని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆమె ఒంటరిగా ఎందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిందని తేలడం లేదు.

Missing woman from Hyderabad found dead near hill in Maharashtra

27 ఏళ్ల రచిత గుప్తా కనోడియా హైదరాబాదులోని బషీర్‌బాగ్ అవంతినగర్‌కు చెందిన వ్యాపారవేత్త అమిత్ కుమార్ కనోడియా భార్య. ఆమె నవంబర్ 25 తేదీన హైదరాబాద్ నుంచి వెళ్లింది. నవంబర్ 29వ తేదీ నుంచి కనిపించడం లేదు.

ఆమె శవం డిసెంబర్ ఆరో తేదీన కనిపించింది. తలకు గాయం ఉంది. హైదరాబాదులో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న హైదరాబాదులోని నారాయణగుడా పోలీసులు ఏడు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు .సబ్ ఇన్‌స్పెక్టర్ కొప్పు సైదులు నేతృత్వంలో ఓ బృందం గాలింపు చర్యల్లో పాల్దొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+