చంద్రబాబు సూచనతో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి..?
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే మెల్లగా జారుకుంటున్నారు. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ప్రకాష్ గౌడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ మారడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారని సమాచారం. ఆయన గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోవడం, ఎమ్మెల్యేలు ఒక్కోక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరితినే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈక్రమంలోనే అరికెపూడి గాంధీ శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారని తెలుస్తోంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాతరనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరితే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన వెంటే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. అరికెపూడి గాంధీ తొలుత టీడీపీలో పని చేశారు. రాష్ట్రంలో టీడీపీ కనుమరుకు కావడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇక ఇటీవల ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ అయిన కొద్ది రోజులకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు అరికెపూడి గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications