అధికారి గల్లా పట్టిన ఎమ్మెల్యే: మరో ఎమ్మెల్యే తిట్లు, ఆఫీస్‌లోనే ఏడ్చిన అధికారి
అదిలాబాద్/హైదరాబాద్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. నీటి పారుదల శాఖ అధికారి దేవేందర్ పైన అనుచితంగా ప్రవర్తించి, దాడి చేయడం పట్ల ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం మంచిర్యాలలో నీటి పారుదల శాఖ ఉద్యోగులు విధులకు హైజరై.. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ సమ్మెకు దిగారు.
అదిలాబాదులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో జిల్లా ప్రగతి పైన ఏర్పాటు చేసిన సమావేశాన్ని అన్ని శాఖల ఉద్యోగులూ బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సమావేసానికి హాజరైన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు.
మిషన్ కాకతీయ కింద బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో పలు చెరువుల పనులు జరిగాయి. ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు కొందరు గుత్తేదారులుగా పనులు చేశారు. వీరికి బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
క్షేత్రస్థాయిలో పనులు సరిగా లేకపోవడంతో.. వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు దేవేందర్ తెలియజేశారు. జరిగిన పనుల కంటే ఎక్కువ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినా అధికారులు అంగీకరించలేదు. ఈ క్రమంలో సోమవారం నాడు తన ఇంటికి రావాలని అధికారికి ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చింది.
ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పిన అధికారి దేవేందర్.. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో సదరు అధికారి చొక్కా కాలర్ పట్టుకొని లాగారు. చెంప దెబ్బ కొట్టాడు. ఆయనను గోడపైకి తోసేశారు. బూతులు కూడా తిట్టినట్లు బాధితుడు చెప్పారు. దీంతో, అధికారులు మండిపడుతున్నారు. అయితే, తాను అధికారి పైన దాడి చేయలేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.
ఏఈ దేవేందర్ పైన తాను దాడి చేయలేదని, మందలించాను అంతే అని ఎమ్మెల్యే చెప్పారు. దేవేందర్‌కు బాధ కలిగితే క్షమించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని, అయితే వారు తీరు మార్చుకోవాలన్నారు.

ఇదిలా ఉండగా, వికారాబాద్ ఎమ్మెల్యే కూడా అధికారులపై తిట్ల దండకం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సదరు అధికారి గోపాల్ వెక్కివెక్కి ఏడ్చారని అంటున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవ రావు మునిసిపల్ డీఈ గోపాల్ పై తిట్ల దండకం అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫైళ్లు తీసుకుని ఇంటికి రావాలన్న ఎమ్మెల్యే మాట ఇంజినీర్ వినలేదని, దీంతో, అగ్గిమీద గుగ్గిలమైన ఎమ్మెల్యే నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి... కమిషననర్ చాంబర్‌లోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో, ఇంజినీర్ ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు.
ఇంజినీర్‌ను చూసిన వెంటనే సంజీవరావు ఆగ్రహోదగ్రులయ్యారని, ఫైళ్లు ఇంటికి తెమ్మంటే ఎందుకు తేలేదని బూతు పురాణం వినిపించారని చెబుతున్నారు. దీంతో తీవ్ర వేదనకు గురైన గోపాల్ అక్కడే వెక్కివెక్కి ఏడ్చారని, ఆ తర్వాత ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయినా, గోపాల్ ఏడుస్తూనే కూర్చుండిపోయారని వార్తలు వస్తున్నాయి.
ఈ తతంగం మొత్తాన్ని సీసీటీవీలో చూసిన కమిషనర్ అక్కడికెళ్లి గోపాల్‌ను ఓదార్చారని సమాచారం. దీంతో, మున్సిపల్ సిబ్బంది అప్పటికప్పుడు నిరసనకు దిగి ఎమ్మెల్యేపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications