కౌశిక్ ఇంటికి గాంధీ, రచ్చ రచ్చ - గుడ్లు, టమోటాలతో దాడులు..!!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి...కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సవాళ్లతో రెండు పార్టీల కేడర్ మధ్య ఘర్షణకు కారణమైంది. మ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లారు. దీంతో అక్కడ రచ్చరచ్చ జరుగుతోంది. కౌశిక్ ఇంటి వద్ద గాంధీ ధర్నాకు దిగారు. కౌశిక్ ఇంటి పైన కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేసారు.
కౌశిక్ ఇంటి వద్ద
కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను తోసుకొని లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నియంత్రించడం పోలీసులకు కూడా కాస్త కష్టంగా మారింది. ఇద్దరి మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం ఇప్పుడు ఉద్రిక్తతలకు కారణమైంది.

ధర్నా - ఉద్రిక్తత
ఫిరాయింపుల పర్వంలో భాగంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సవాళ్లకు - ప్రతి సవాళ్లకు కారణమయ్యాయి. చీరాగాజులు చూపిస్తూ కౌశిక్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గి రాజేసింది.. ఇప్పుడు అది మరింతగా భగ్గుమంది..! అరికపూడి గాంధీ అయితే.. కౌశిక్ తీరును, మాటల్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.. కౌశిక్‌రెడ్డి సవాల్‌కు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అరికెపూడి గాంధీ.. దమ్ముంటే రా.. నువ్వోనేనో తేల్చుకుందాం అంటూ కౌశిక్‌రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. తానేమీ
సవాళ్లు - ప్రతి సవాళ్లు
దీనికి గాంధీ తీవ్రంగా స్పందించారు. చేతులు కట్టుకుని కూర్చోలేదు.. దేనికైనా సిద్ధం అంటూ ఒక రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి వస్తానని సవాల్ చేసి రాకపోవటంతో తానే ఆయన ఇంటికి వచ్చానని గాంధీ చెప్పుకొచ్చారు. అక్కడే ధర్నాకు దిగారు. గాంధీ ఇంటికి బయలుదేరుతా అనగానే తన ఇంటి చుట్టూ కంచెలు వేశారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. తనను ముందస్తుగా అరెస్ట్ చేశారన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద రెండు పార్టీల కేడర్ మధ్య ఘర్షణ పెరగటంతో..పోలీసులు గాంధీతో సహా రెండు పార్టీల శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications