పంచాయితీ అంతా రేవంత్ రెడ్డికి.. నాకే ..! కలిసి పనిచేయలేక పోతున్నా..!! : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆపార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి పీకేసినంత మాత్రాన తనకు కానీ , పార్టీకి కానీ వచ్చిన నష్టం లేదనన్నారు. కాంగ్రెస్ పార్టీ, హైకమాండ్‌తో తనకు ఇబ్బంది లేదన్నారు. రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్ గురించే ధైర్యంగా మాట్లాడుతాను. ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీలో తాను ఎదిగినట్లు చెప్పారు.

పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే..
అసలు పంచాయితీ అంతా రేవంత్ రెడ్డికి తనకే అని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పీసీసీ అధ్యక్షుడుగా పనిచేయాలని పోటీ పడ్డా.. కానీ చివరికి రేవంత్‌కు అధిష్టానం అప్పజెప్పిందని పేర్కొన్నారు. అయినా వాటన్నింటినీ పక్కన పెట్టి పార్టీకోసం పనిచేస్తున్నాను . రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తికే గాంధీ కుటుంబం క్షమాభిక్ష పెట్టింది. అలాంటి కుటుంబం, పార్టీలో ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.. రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయలేనని ఎన్నో సందర్భాల్లో చెప్పా. పంచాయితీ ఆయనతోనే అని పేర్కొన్నారు.

నాతో మాట్లాడేందుకు భయపడుతున్నారు..
సోనియా, రాహుల్ గాంధీల గురించే తాను పార్టీలో పనిచేస్తున్నానని జగ్గారెడ్డి చెప్పారు.. నేను పార్టీలు మారిన మాట వాస్తవమే . కానీ సోషల్ మీడియాలో నా వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానూ, భట్టి, శ్రీధర్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు తాను ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నానని చెప్పారు. నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాతో మాట్లాడేందుకు భయపడుతున్నారు..

పీసీసీ చీఫ్ ఎలా అయ్యావో..
జాతీయ, రాష్ట్ర స్థాయిలో మేలు చేసేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు.. సోనియా, రాహుల్ గాంధీలే ప్రజల గురించి ఆలోచిస్తారని చెప్పారు.. 20 రోజుల క్రితం నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. మెదక్ చర్చికి వెళ్తున్నా.. ఎవరితోనైనా చెప్పమని అన్నారు. కానీ దామోదర్ రాజనర్సింహతో మరో విధంగా చెప్పారన్నారు. జగ్గారెడ్డి , తాను కారులో వెళ్తున్నాని రాజనర్సింహతో చెప్పారు. ఇదే విషయంపై నిలదీశాను.. తప్పా.? అని ప్రశ్నించారు.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నేనేంటో తెలిసి చేశావా.. తెలియక చేశావా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలియక చేస్తే పీసీసీ అధ్యక్షుడివి ఎలా అయ్యావో తెలుసుకో అని నిలదీశారు.. పీసీసీ భేటీలో ఇదే విషయంపై కోపంతో మాట్లాడా... భట్టి నచ్చచెబితే ఈ రోజు ఏమీ మాట్లాడకుండా ఊరకున్నానని పేర్కొన్నారు.

రేవంత్ వ్యవహార శైలి సరైనదేనా.?
రేవంత్ వ్యవహార శైలి సరైనదేనా.? అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసుకుకొచ్చినప్పుడు రేవంత్ నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆతర్వాత ఇద్దరం గదిలోకి వెళ్లాం. లోపలికి వెళ్లాక ఈ పరిణామాలు వేటి గురించి మాట్లాడలేదు. కేసీఆర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆ రోజు రేవంత్ నాతో చెప్పారు. ఎప్పుడేమైనా జరగొచ్చని రేవంత్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటే అసెంబ్లీ జరుగుతుందా? అని ప్రశ్నించారు. నాపై నిందల గురించి నిజ నిజాలను దైవసాక్షిగా చెబుతున్నాని అన్నారు. నా శీల పరీక్ష చేశారని దుయ్యబట్టారు.. వీహెచ్‌ను తక్కువ అంచనా వేస్తున్నారు. మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తన కుమార్తె కోసం కలిసారని చెప్పారు. నాడు సోనియా గాంధీని తిట్టిన రేవంత్ కి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. అధిష్టానం నుంచి పిలుపు రాలేదు.. వస్తే అన్ని విషయాలు చెప్తానని చెప్పారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications