జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసు కీలక విషయాలు: నేపాల్‌లో సుపారీ గ్యాంగ్‌తో ప్రసాద్
హైదరాబాద్: ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసులు పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఆయన హత్యకు కుట్రపన్నారు నిందితులు. ఆర్మూర్ కు చెందిన మక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్‌ను ఈ కుట్రలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

అలా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కక్ష పెంచుకున్న ప్రసాద్
తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ప్రసాద్ గౌడ్ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఇంటి దగ్గర మంగళవారం ఉదయం ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. నిందితుడు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న కత్తి, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మెల్యే హత్య కోసం నేపాల్ వెళ్లిన నిందితుడు ప్రసాద్
కాగా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు రోజుల క్రితమే ప్రసాద్.. నేపాల్ వెళ్లి వచ్చినట్లు సమాచారం. అంతేగాక, అక్కడే పిస్టల్ కూడా కొన్నట్లు తెలిసింది. నేపాల్‌లోనే సుపారీ గ్యాంగ్ ను కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెపన్ డీలర్లతో ప్రసాద్ సంభాషణలు పలు మీడియాల్లో ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు నిందితుడ్ని విచారిస్తున్నారు.

జీవన్ రెడ్డి, ప్రసాద్ మధ్య విభేదాలు తారస్థాయికి
అయితే, జీవన్ రెడ్డితో గత ఏడాది కాలంగా ప్రసాద్ కు రాజకీయ విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగిన కల్లెడ సర్పంచ్ గా గెలిచారు ప్రసాద్ భార్య లావణ్య. ఈ క్రమంలో టీఆర్ఎస్ అనుబంధ నేతగానే కొనసాగారు ప్రసాద్ గౌడ్. అయితే, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రం ఓడిపోయిన వారికి మద్దతుగా నిలుస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. పలు బిల్లులు కూడా ఆపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పలు పరిణామాలు వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఓ సమయంలో ఖబడ్ధార్ అంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హెచ్చరించారు ప్రసాద్. తమకు ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతోనే జీవన్ రెడ్డిని ప్రసాద్ హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు తెలుస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications