Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో వివాదంలో పాడి కౌశిక్ రెడ్డి: యాదాద్రిలో భార్య, కూతురుతో కలిసి రీల్స్!

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో మహిళా గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. ఇటీవల అరెకపూడి గాంధీకి సవాల్ విసిరి ఆ తర్వాత పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. తాజాగా, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయం ఆవరణలో రీల్స్ చేసి మరో వివాదానికి తెరతీశారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కౌశిక్ రెడ్డి తన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్‌ చేసిన వీడియోలు సోషల్ మీడియాల్లో పంచుకోవడం వివాదానికి దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఎక్స్‌ వేదికగా ఈ పోస్టులు చేశారు. దీంట్లో తన సతీమణి శాలిని పుట్టిన రోజు సందర్భంగా పోస్టు చేసిన వీడియో వివాదానికి తెరతీసింది.

MLA Kaushik Reddy in another controversy Reels with his wife and daughter in Yadadri

ఆ వీడియోలో తన సతీమణి శాలినితో కలిసి యాదాద్రి ఆలయంలో రీల్స్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 3వ తేదీన తన కుమార్తె శ్రీనిక జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కూడా యాదాద్రి క్షేత్రం వద్ద తీసినవే కావడం గమనార్హం.

యాదాద్రి ఆలయ మాఢ వీధుల్లో తిరుగుతూ తన కుమార్తె శ్రీనికతో కౌశిక్ రెడ్డి రీల్స్ చేయించారు. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుత పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి.. ఆలయ క్షేత్రంలో ఇలా రీల్స్ చేయడం సరికాదని పలువురు నెటిజన్లు హితవు పలుకుతున్నారు. వీడియో చూస్తే కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్ కోసమే ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. వారు రీల్స్ చేసేటప్పుడు భక్తులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.


కాగా, ప్రస్తుతం వివాదంగా మారిన ఈ రీల్స్ వ్యహారం​పై ఆలయ పాలక మండలి స్పందించలేదు. ఈ విషయంపై ఆలయ ఈవో భాస్కర్ రావును వివరణ ఇస్తూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో చిత్రీకరణ కోసం అనుమతి కోరారని, అయితే, తాము అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆలయ బయటి ప్రాంగణంలో తీసుకోవచ్చని తెలియజేసినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+