మల్లారెడ్డి కోడలా మజాకా.. యంగ్ హీరోతో స్టెప్పులు అదరగొట్టేశారుగా !!!
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యాపారవేత్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా, ఆపై రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన పొలిటికల్ గా కంటే కూడా.. తన స్పీచ్ లు, ఇంటర్వ్యూలతో ఫుల్ వైరల్ గా మారారు.
కాగా మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కూడా సుపరిచితులే. ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె.. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్లో ప్రముఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమ విద్యా సంస్థల్లో తరచూ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులతో కలిసి పాల్గొంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇటీవల కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైన ప్రీతిరెడ్డి.. కాలా చష్మా పాటకు డ్యాన్స్ చేయగా ఆ వీడియో ఫుల్ వైరల్ అయ్యింది. స్టూడెంట్స్‌తో కలిసి ప్రీతిరెడ్డి డ్యాన్స్ చేస్తున్న టైమ్‌లో.. మల్లారెడ్డి కూడా వెనకే ఉండి కోడలుని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మరోసారి తన డాన్స్ ప్రతిభతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

యంగ్ హీరోతో కలిసి డాన్స్..
ప్రముఖ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి నటించిన చిత్రం 'అనగనగా ఒకరోజు'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా 'రాజు గారి పెళ్ళిరో' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఈ క్రమంలోనే నవీన్ పొలిశెట్టితో కలిసి ప్రీతి రెడ్డి డ్యాన్స్ అదరగొట్టారు. ప్రీతిరెడ్డి, నవీన్ డ్యాన్స్ చేస్తుంటే కాలేజీ విద్యార్థులు ఈలలతో వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగడం కష్టమని అన్నారు. ఈ పరిశ్రమలో ఎదుగుతుంటే కిందకు లాగేవారు ఎందరో ఉంటారని.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టపడి ఎదుగుతున్న నవీన్ ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు.
Star Entertainer @NaveenPolishety, @Meenakshiioffl, and Vice Chairman of Malla Reddy Vishwavidyapeeth Dr. CH Preeti Reddy garu sshakes a leg to The Wedding Song of the Year ~ #RajuGaariPelliRo 😍💃🕺
— Sithara Entertainments (@SitharaEnts) December 26, 2025
– https://t.co/O5KDUijwHJ#AnaganagaOkaRaju in Cinemas Worldwide on JAN 14th,… pic.twitter.com/evrFbXiVsG
-
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్!












Click it and Unblock the Notifications