ఏడు పదుల వయసులో ఇదేం పాడు పని.. ఎమ్మెల్యే గారూ! (వీడియో)
ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించాల్సిన ఓ ఎమ్మెల్యే.. పద్ధతి మరచి ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న 'మహాలక్ష్మి' పథకం పనితీరును అంచనా వేసే క్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హద్దులు మీరారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా కళాశాల విద్యార్థిని పట్ల ఆయన అనుచితంగా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.
అసలేం జరిగిందంటే?
తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి'(ఉచిత బస్సు ప్రయాణం) పథకం మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతోందనేది స్వయంగా తెలుసుకునేందుకు మంగళవారం(అక్టోబర్ 6) ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణీకులతో ముచ్చటించారు. బస్సులో నిలబడి ఉన్న ఓ యువతిని ఆప్యాయంగా పలకరించి స్కీమ్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ మహాలక్ష్మి పథకం వల్ల తన కాలేజీ ప్రయాణ ఖర్చులు పూర్తిగా ఆదా అవుతున్నాయని, ఏడాదికి దాదాపు రూ.45,000 వరకు మిగులుతున్నాయని సంతోషంగా వివరించింది.

ఓ వైపు విద్యార్థిని ప్రభుత్వ పథకంపై తన సానుకూల అభిప్రాయాన్ని చెబుతుండగా.. మరోవైపు 70 ఏళ్ల వయసున్న ఎమ్మెల్యే రంగారెడ్డి వ్యవహరించిన తీరే ఇప్పుడు వివాదానికి కారణమైంది. సంభాషణ సాగుతుండగానే ఆయన పదేపదే ఆ యువతి చేయి పట్టుకోవడం, తాకడం వీడియోలో స్పష్టంగా రికార్డైంది. ఎమ్మెల్యే తనను తాకడం పట్ల ఆ విద్యార్థిని శరీర భాషలో స్పష్టమైన అసౌకర్యం స్పష్టంగా కనిపించింది. ఆమె తన చేయిని వెనక్కి లాక్కునేందుకు, సున్నితంగా తప్పించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. ఎమ్మెల్యే మాత్రం తన భౌతిక స్పర్శను ఆపకుండా అలాగే కొనసాగించడం గమనార్హం.
సోషల్ మీడియాలో విమర్శల వర్షం
దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట ప్రత్యక్షం కావడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు ఆర్టీసీ బస్సులో ఓ యువతి పట్ల ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల వ్యక్తిగత సరిహద్దులను గౌరవించాలనే కనీస స్పృహ లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ విషయంపై ప్రముఖ సింగర్, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద తీవ్రస్థాయిలో స్పందించారు. ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. "పురుష రాజకీయ నాయకులకు ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. ఆయన వయసు ఎంతన్నది ముఖ్యం కాదు.. ఆ అమ్మాయికి ఆ స్పర్శ అసౌకర్యంగా అనిపించింది. కన్సెంట్(సమ్మతి) అనే ఇంగితజ్ఞానం లేకపోవడం శోచనీయం" అని ఘాటుగా విమర్శించారు.
The Congress needs to train its male politicians to keep their hands off girls. His banal conversation doesnt need him to repeatedly touch her. Doesn’t matter how old he is - she is NOT comfortable and this man has NO idea of consent. Keeps reaching out, feeling her upper waist when she is attempting to move away in that cramped space plus holds the hand of her friend who also helps pull her back. Women are Goddesses blah blah but wont leave a chance to feel up a child old enough to be his grand daughter.
— Chinmayi Sripaada (@Chinmayi) October 6, 2026
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
మరోవైపు ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఉదంతంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన షీ టీమ్స్, మహిళా రక్షణ విభాగం ఈ ఘటనపై వెంటనే సుమోటోగా స్పందించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల పట్ల అసభ్యంగా, హద్దు మీరి ప్రవర్తించిన వారిపై చట్టపరమైన సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఇలాగే ఉంటే సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై అటు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాలు, ఇటు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
DGP Women Safety, @TelanganaDGP Where are the SHE teams here?Take a complaint from RTC conductor and book under 354 IPC.Both BJP and Congress are competing with each other in insulting women!
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 6, 2026












Click it and Unblock the Notifications
