రాజా సింగ్‌కు మరో షాక్: లక్షల్లో ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్‌పై నిషేధం
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరో షాక్ తగిలింది. వీడియో స్ట్రీమింగ్ సైట్ యూట్యూబ్‌లో ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారంటూ ఆయనకు చెందిన 'శ్రీరామ్ ఛానల్ తెలంగాణ' అనే యూట్యూబ్ ఛానల్ నిషేధానికి గురైంది.
కాగా, నిషేధం సమయంలో ఛానెల్‌కు 5.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 1K వీడియోలు పోస్టులు ఉండటం గమనార్హం. రాజా సింగ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్ నిషేధంపై ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ద్వేషపూరిత ప్రసంగాలపై తాము ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ నిషేధానికి గురైందని పేర్కొన్నారు.

మూడు నెలల పాటు ఛానెల్‌ను పర్యవేక్షించిన తర్వాత ఆల్ట్ న్యూస్ యూట్యూబ్‌కు లేఖ రాసిందని దాని రీసెర్చర్ కలీమ్ చెప్పారు.
Suspended BJP MLA T Raja's verified YouTube channel has been terminated after @AltNews highlighted violations of hate speech policies in an email to YouTube. It had 5.5+ lakh subscribers and over 1K videos.
— Mohammed Zubair (@zoo_bear) April 14, 2023
Do let us know if you come across more such hateful YT channels. ✌️✊👊 https://t.co/Qy9SxrrCDC
కాగా, ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ హైదరాబాద్ నగరంలో కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, తాను ఎలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెట్టి.. మరోసారి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజా సింగ్ పాల్గొనేందుకు వెళుతుండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత విడిచిపెట్టారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications