అవసరాల కోసమే పోతుంటారు: బాబు షాకింగ్, రేవంత్ ప్రశంసలు, మళ్లీ ఏపీ నేతలపై..
తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికరంగా స్పందించారు. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంటాయని అన్నారు. అసవరాలను బట్టి కొందరు అలాంటి
అమరావతి: తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికరంగా స్పందించారు. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంటాయని అన్నారు. అసవరాలను బట్టి కొందరు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.

భవిష్యత్ కోసమే..
పార్టీలోకి వస్తుండటం, పోతుండటం జరుగుతూనే ఉంటుందని చంద్రబాబు అన్నారు.
వారి భవిష్యత్ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని రేవంత్ రాజీనామాను ఉద్దేశించి అన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల పార్టీకేమీ నష్టం ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీ నేతలపై రేవంత్ మరోసారి..
ఇది ఇలా ఉండగా, తాను ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీలో పరిణామాలు బాధించాయని, తాను టీఆర్ఎస్ పార్టీ సర్కారుపై పోరాటం చేస్తుంటే.. కొందరు ఏపీ నేతలు సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు.

నేనెప్పుడూ.. బాధించాయి..
తాను ఎప్పుడూ టీడీపీ శ్రేయస్సు కోరే వ్యక్తినని రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలు బాధించాయని రేవంత్ అన్నారు.

చంద్రబాబు కృషి ఎంతో ఉంది..
పార్టీలో తన ఎదుగుదలకు చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారని రేవంత్ అన్నారు. చంద్రబాబుపై తనకు ఎంతో గౌవరముందని చెప్పుకొచ్చారు. కార్యకర్తలు, చంద్రబాబు కారణంగానే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.

ఆ తర్వాతే తదుపరి నిర్ణయం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల ఇతర పార్టీల నేతలతో కలిసి టీడీపీని నాశనం చేస్తున్నారని రేవంత్ అన్నారు. కోడంగల్ నియోజకవర్గం శ్రేణులను, అనుచరులను అడిగితన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటానని రేవంత్ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం తన రాజీనామాను ఏపీ సీఎం పేషీలో రేవంత్ రెడ్డి అందజేసిన విషయం తెలిసిందే. కాగా, అనుచరులతో కోడంగల్‌లో భేటీ అయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications