ఎమ్మెల్సీ ఎన్నికలు: రేవంత్ కేసులో స్టీఫెన్‌కు అభినందన, ఓటేసిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అధికార తెరాస నుండి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్, యాదవ రెడ్డి, బోడికుంట వెంకటేశ్వర రావు, టీడీపీ నుండి వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస నుండి ఆకుల లలిత బరిలో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ఓటు సభాపతి, చివరి ఓటు కేసీఆర్ వేశారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు 118 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కునువినియోగించుకున్నారు.
ఒకటి గంటల వరకు 70 శాతం మంది ఓట్లు వేశారు.
ఓటు వేసేందుకు వచ్చిన మజ్లిస్ ఎమ్మెల్యేలు
రేవంత్ రెడ్డి కోసం మార్షల్స్ రంగంలోకి దిగవలసి వచ్చిదని తెలుస్తోంది. ఆయన ఓటు వేసేందుకు కాలయాపన చేశారు. అయితే, తెరాస నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రేవంత్‌ను తరలించేందుకు మార్షల్స్ వచ్చారు. దీంతో ఆయన బయటకు వచ్చారు.
శాసన సభలోకి ఏసీబీ అధికారులను లోపలకు అనుమతించలేదు. పలుమార్లు ఏసీబీ అధికారులు రావాలని రేవంత్‌కు సమాచారం అందించారు. అనంతరం కాసేపటికి ఆయన బయటకు వచ్చారు. దీంతో ఆయనను అధికారులు జైలుకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటి వరకు ఆయన న్యాయవాదులు, ఇతర ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కనిపించారు.
స్టీఫెన్ సన్‌ను అభిందించిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ రెడ్డి. జైలుకు తరలింపు
రేవంత్ రెడ్డి మినహా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ మాట్లాడుతూ.. నేను టీడీపీ ఎమ్మెల్యేతో పాటు ఉపనేతను అని చెప్పారు. తనకు ఓటు వేసేందుకు కోర్టు అనుమతిచ్చిందన్నారు. ఓటింగ్ ప్రక్రియ పరిశీలించే బాధ్యత తన పైన ఉందన్నారు.
మరోవైపు, రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా తొలుత భావించారు. అయితే, ఆయన ఇంకా ఓటు
హక్కును వినియోగించుకోలేదు. సాయంత్రం మూడు గంటల వరకు ఆయన అసెంబ్లీలో ఉండేందుకు అనుమతి ఉంది. దీంతో ఆయన ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలుస్తోంది.
ఓటు హక్కు వినియోగించుకున్న స్టీఫెన్ సన్‌ను తెరాస నేతలు అభినందించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా ఓటు వేసేందుకు రాలేదు. వారు అందరు మూకుమ్మడిగా వచ్చి ఓటేస్తామని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఓటు వేయడానికి ముందు టీడీఎల్పీ సమావేశానికి ఆయనను పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ఎర్రబెల్లి వారితో వాగ్వాదానికి దిగారు.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓటు వేశారు.
రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపిన కేసులో కీలకమైన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టీఫెన్ సన్ తెరాస నేతలకు నమస్కరిస్తూ వెళ్లి ఓటేశారు.
రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు పలకరించారు.
రేవంత్ రెడ్డి చిరునవ్వుతోనే కనిపించారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఓటింగ్‌కు వామపక్షాలు దూరంగా ఉన్నాయి.
కోర్టు అనుమతితో ఓటు వేసేందుకు వచ్చిన రేవంత్‌ను తెలంగాణ టీడీపీ నేతలు ఆలింగనం చేసుకున్నారు. కోర్టు అనుమతితో ఓటు వేసేందుకు వచ్చిన రేవంత్‌ను తెలంగాణ టీడీపీ నేతలు ఆలింగనం చేసుకున్నారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపారని ఆదివారం రేవంత్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. న్యాయమూర్తి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో అతను అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు అతనిని అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications