Jeevan Reddy: ఆత్మస్థైర్యం కోల్పోతున్నాం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీపై మాట్లాడుతున్నారు. తాజాగా ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయామని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనతో చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ సంజయ్ పోటీ చేశారు. అయితే సంజయ్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

దీంతో జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మంత్రులు, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి సర్ది చెప్పారు. అయినపట్టికీ ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. జగిత్యాలలో అధికారులు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఉన్నారు. తాజాగా జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డి మరింత మనస్తాపం చెందారు. గంగారెడ్డి హత్య చేసిన నిందితుడిని పట్టుకోవాలని రోడ్డు పై బైఠాయించారు. ఆయనకు తొడుగా ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ నిరసనలో పాల్గొన్నారు.

MLC Jeevan Reddy made key comments about the party

పోలీసులు తన మాట వినడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. అలాగే హత్య చేసిన నిందితుడు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడిగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డితో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జగిత్యాల జరుగుతున్న పరిణామాలను జీవన్ రెడ్డి మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయినప్పటికీ జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుయాష్కీ గౌడ్ జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డిని కలిశారు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అని అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పలు వ్యాఖ్యలు చేశారు.జీవన్‌రెడ్డి ఒంటరి కాదన్నారు. సమయం వచ్చినప్పుడు జగ్గారెడ్డి అండగా ఉంటానని చెప్పారు. జీవన్‌రెడ్డి రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందని గుర్తు చేశారు.

జీవన్ రెడ్డికి అడుగడుగునా కష్టాలు వస్తున్నాయని చెప్పారు. జీవన్‌రెడ్డి ఆవేదన మీడియాలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించినట్లు జగ్గారెడ్డి చెప్పారు. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని ఎందుకు ఓడగొట్టారో తెలియడం లేదన్నారు. సంగారెడ్డి ప్రజలు తనను ఎందుకు ఓడించారు అర్థం కావడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+