కవిత చేసింది కరెక్ట్.! నిండు గర్భిణికి ఎమ్మెల్సీ అండ.!

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ చిట్టి ప్రాణం ఈ ప్రపంచంలోకి వచ్చింది. కొస్గికి చెందిన జ్యోతి బాయి 9 నెలల గర్భవతి. అయితే డెలివరీ డేట్ కంటే ముందే నొప్పులు రావడంతో పాటు రక్తం తక్కువగా ఉండడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయిన జ్యోతి బాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో జ్యోతి బాయి మరిది ట్విట్టర్ లో సహాయం కోసం అభ్యర్థించాడు. మనసున్న కొంతమంది మంచి మనుషులు స్పందించారు. కొంత మొత్తం జమైంది. కాని ఆపరేషన్ ఖర్చుకు అది ఎంత మాత్రం సరిపోదు. మరోవైపు జ్యోతి బాయి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. సరిగ్గా ఇక్కడే అసలు విసయం ఎమ్మెల్సీ కవితకు తెలిసింది.

mlc kavitha did good Job for pregnancy woman.

అయితే జ్యోతి బాయి గురించి ఎమ్మెల్సీ కవిత కు తెలియడంతో ఆ కుటుంబానికి ఎంతో ఊరట లభించింది. జ్యోతి బాయి ఆపరేషన్ ఖర్చును భర్తిస్తానని ఎమ్మెల్సీ కవిత హామి ఇచ్చారు. కవిత చొరవతో జ్యోతిబాయికి క్లిష్టమైన ఆపరేషన్ ఈ రోజు పూర్తైంది. పండండి బిడ్డకు జ్యోతిబాయి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు నిర్దారిస్తున్నాయి. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపి ఎమ్మెల్సీ కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన సహాయంతో జ్యోతి బాయి భర్త, మరిది చలించిపోయారు. కవిత స్పూర్తితో తాము కూడా ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేస్తామని ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్ లు అయిన వారు ఇక నుంచి తాము గర్భిణీలను ఉచితంగా హాస్పిటల్స్ కు తీసుకుపోతామని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీ కవిత చూపిన చొరవ ఆదర్శవంతంగా మారిందనే చర్చ జరుగుతోంది. కవిత ఏం చేసినా కరక్టే అనుకుంటున్నారు ఆమె అనుచరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+