MLC Kavitha: పీకల్లోతు కష్టాల్లో కవిత.. మరో షాక్!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోయిన కవిత బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కవితకు ముందు ముందు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి సిబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరు పరిచారు.

జులై 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
అయితే సిబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని మరోమారు రౌస్ అవెన్యూకోర్టు పొడిగించింది. జులై 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈడీ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని జూలై మూడవ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

MLC Kavitha is in trouble Judicial Remand extension again in CBI case in delhi liquor scam

కవిత కేసు.. మార్చి 15 అరెస్ట్ నాటి నుండి కవితకు కష్టాలు
ఈ సంవత్సరం మార్చి 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై కవితను కోర్టు ముందు హాజరు పరచడం కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు కవిత ఈ కేసులో బెయిల్ కోసం విఫల యత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు.

కవిత బయటకు రాకుండా ఈడీ, సీబీఐ వాదనలు
ఇదిలా ఉంటే ఈడి కేసులతో పాటు సిబిఐ కూడా అవినీతి ఆరోపణలతో కవితపైన కేసు పెట్టింది. దీంతో అటు ఈడీ కేసును, ఇటు సిబిఐ కేసును ఎదుర్కొంటుంది కవిత. కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారి ఈడి, సిబిఐ బలమైన వాదనను వినిపిస్తూ కవితకు బెయిల్ రాకుండా చేస్తున్నాయి. కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారి ఈడి, సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కవిత పాత్రపైన కీలక విషయాలను వెల్లడిస్తున్నాయి.

కవితకు నో రిలీఫ్
అంతేకాదు కవిత నేరం చేశారు అనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కోర్టులో బలంగా వాదిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ కవితకు ఈ కేసు నుండి ఉపశమనం దొరకడం లేదు. కనీసం బెయిల్ కూడా రాని స్థితిలో కవిత తీహార్ జైల్లో మగ్గిపోతున్నారు. వరుస షాకులతో ఖంగు తింటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+