ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఒకరోజు నిరాహార దీక్ష: బీజేపి నేతల వ్యాఖ్యలపై ఇలా
రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేయనున్నారు భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికలలో రెండుసార్లు హామీ ఇచ్చి.. మాట తప్పుతోందని ఆరోపించారు.
ఇందుకు నిరసనగానే భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మార్చి 10న ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు కవిత తెలిపారు. మహిళా దినోత్సవమైన 8న హోళీ పండగ ఉండటంతో 10న కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని కవిత వెల్లడించారు.

ఈ కార్యక్రమంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనగణన చేపట్టని మోడీ ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనాభా లెక్కలు తీయాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు, గ్యాస్ ధరల పెంపుపైనా కవిత స్పందించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టారీతిన విమర్శలు చేసే బీజేపీ నేతలు.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గ్యాస్ ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ పనిచేస్తే పేద ప్రజలకు మేలు చేసిన వారవుతారన్నారు.












Click it and Unblock the Notifications