జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్దం - రేవంత్ టీం చర్చలు, ఆందోళన..!!

కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్ లో చేరిక అనూహ్య పరిణామాలు చోటు చేసుకంుటున్నాయి. ఈ వ్యవహారంతో అసంతృప్తికి గురైన హస్తం పార్టీ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామాకు నిర్ణయించారనే ప్రచారం సాగుతోంది. దీంతో, రేవంత్ సూచనలతో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌ ఇద్దరూ జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయణ్ను బుజ్జిగించే ప్రయత్నం చేస్తున్నారు.

బుజ్జగింపులు
తనకు కనీసం సమాచారం లేకుండా బీఆర్ఎస్ నేతను పార్టీలో చేర్చుకోవడంతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని జీవన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారన్న విషయం తెలియగానే కాంగ్రెస్‌ అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం.

MLCJeevan Reddy preapred for Resignation Party leaders begins Discussions

వరుస మంతనాలు
జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యే సంజయ్‌, జీవన్‌రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్‌ను హస్తం గూటికి చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

వెనక్కు తగ్గేనా
ఎమ్మెల్యే సంజయ్​ పార్టీ మార్పుపై బీఆర్​ఎస్​ శ్రేణులు భగ్గుమన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిచంగా జగిత్యాల తహసీల్‌ చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటిని గులాబీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డితో చర్చలకు వచ్చిన ఇద్దరు నేతలను కార్యకర్తలు నిలదీస్తున్నారు. దీంతో, జీవన్ రెడ్డి వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+