మారేడుపల్లి ఘటనపై పోలీసుల సీరియస్: అదుపులో పది మంది (ఫోటోలు)
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్‌పల్లి పోలీసుస్టేషనుపై సోమవారం రాత్రి స్థానికులు దాడి చేసి ఫైళ్లు, ఫర్నిచర్, వాహనాలను దహనం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్‌కు చెందిన బన్నప్ప అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో అతడు మృతి చెందాడనే ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన అతడి బంధువులు, కాలనీ వాసులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్‌ఐలు రవి, మధుతోపాటు మరో ఇద్దరు హోంగార్డులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్‌పై దాడిపై పాల్పడ్డ వారిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను సీసీఎస్‌కు బదిలీ చేశారు. పోలీస్‌స్టేషనుపై దాడి ఘటనలో ఆధారాలు లభ్యమయ్యాయని, 8 బృందాలు దర్యాప్తు సాగిస్తున్నాయని పోలీసు అధికారులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
పోలీస్ స్టేషన్ ఆవరణలోని వాహనాలకు కూడా కాలనీ వాసులు నిప్పు పెట్టారు. దీంతో సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
దాడి అనంతరం డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డిలు స్టేషన్‌ను సందర్శించారు. దాడికి పాల్పడ్డ కాలనీ వాసులు సర్వర్ సహా హార్డ్‌డిస్క్, సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు.

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
బన్నప్ప పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తేలుతుందని డీసీపీ చెప్పారు. ఆదివారం రాత్రి బోనాల సందర్భంగా కాలనీకి చెందిన బన్నప్ప (35), ఓ హోంగార్డు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
ఈ క్రమంలో బన్నప్పను పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతని కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బంధువులు ఆ స్ధితిలోనేఇంటికి తీసుకెళ్లారు.య

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
ఎంతకీ అతడు లేవకపోవడంతో అనుమానం వచ్చిన బన్నప్ప బావమరిది పోలీసులను నిలదీశాడు. స్టేషనుకు తీసుకువచ్చే సమయానికే బన్నప్ప మద్యం తాగి ఉన్నాడని, గాంధీ ఆసుపత్రికి తరలించమని పోలీసులు చెప్పారు.

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే బన్నప్ప పోలీస్ స్టేషన్ సమీపంలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు.

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
దాడి అనంతరం మారేడుపల్లి పోలీసుస్టేషన్‌ను సీపీ మహేందర్‌రెడ్డి సందర్శించారు. బన్నప్ప మృతికి కారణాలను విచారణ జరిపిస్తామని తెలిపారు.

స్టేషన్‌పై స్ధానికుల దాడి, ఐదుగురు పోలీసులకు గాయాలు
పోలీసుస్టేషనుపై దాడి ఘటనపై సీనియర్ పోలీసు అధికారితో విచారణ జరుపుతామని, దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీపీ వివరించారు.












Click it and Unblock the Notifications