Mobile Blast: రైతు చేతిలో పేలిన సెల్ ఫోన్..
సెల్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలి. అవి ఎప్పుడు పేలుతాయే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇది వరకు చాలా సార్లు ఫోన్ పేలి చనిపోయిన ఘటనలు కూడా జరిగాయి. తాజాగా వరంగల్ జిల్లాలో సెల్ ఫోన్ పేలుడు(Mobile Blast) ఘటన కలకలం సృష్టించింది. గురువారం ఉదయం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడురుకు చెందిన ఆంగోతు రవి అనే యువ రైతు తన మిర్చీ పంటను మార్కెట్ తీసుకొచ్చాడు. మిర్చిని మార్కెట్ యార్డ్ లో దించిన రవి బంధువులకు ఫోన్ చేశాడు.
బంధువులతో ఫోన్ మాట్లాడుతుండగానే ఒక్కసారిగా చేతిలోనే మొబైల్ పేలింది. భయపడిపోయిన రవి వెంటనే అప్రమత్తమై ఫోన్ ను కిందపడేశాడు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో రైతు రవి గాయపడినట్లు సమాచారం. అయితే సెల్ ఫోన్ వెడెక్కి పేలినట్లు తెస్తోంది. ఒక్కసారిగా మొబైల్ పేలడంతో అక్కడున్న రైతులు భయాందోళనకు గురైయ్యారు. పేలిన సెల్ ఫోన్ ఏ కంపెనీకి చెందిందో తెలియరాలేదు.

ఫోన్లు వాడేవారు బ్రండెడ్ ఫోన్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ మాట్లాడకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ఎక్కువగా వేడవుతుంటే దాన్ని మార్చం మంచదని చెబుతున్నారు. అయితే సెల్ ఫోన్ అనేది నిత్యావరసం అయిపోయింది. ప్రస్తుతం సెల్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరుగుతుంది. డేటా చౌకగా దొరకడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications