డీఎస్పీ మహ్మద్ సిరాజ్ ఈజ్ ఆన్ డ్యూటీ సర్- డీజీపీ సాబ్ తో

భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ డ్యూటీ ఎక్కారు. హైదరాబాద్ డీజీపీ ప్రధాన కార్యాలయంలో సందడి చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా అక్కడే గడిపారు. పోలీస్ చీఫ్ గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరాజ్ ఆయనను కలుసుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఈ సందర్భంగా ఖాకీ యూనిఫాంలో కనిపించారు మహ్మద్ సిరాజ్. ప్రత్యేక సమావేశంలో సిరాజ్‌ వెంట పలువురు అధికారులు ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ గజారావు భూపాల్, డీఎస్పీ రామారావు ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన సీవీ ఆనంద్‌కు సిరాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జెర్సీ నంబర్ 73ని ఆవిష్కరించారు. డీజీపీతో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను సిరాజ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై షేర్ చేశారు.

Mohammed Siraj Meets Telangana DGP CV Anand in Hyderabad in First Courtesy Meeting Shares Exchange

ఈ భేటీ.. ఆత్మీయ వాతావరణంలో సాగిందని, క్రికెట్ ను ఎంతగానో అభిమానించే సీవీ ఆనంద్ డీజీపీ కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీనికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్ లో ఆయనను డీఎస్పీగా నియమించింది.

ఈ గ్రూప్-1 స్థాయి నియామకం కోసం ప్రభుత్వం అప్పట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ లో అవసరమైన సవరణలు సైతం చేసింది. సిరాజ్‌తో పాటు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు కూడా గ్రూప్-1 కేడర్ డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. దీంతో పాటు సిరాజ్‌కు జూబ్లీహిల్స్ లో 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలను పూర్తి చేసుకుంది. ఆయా దేశాలతో టీ20, వన్డే సిరీస్ లను ఆడింది. మొత్తం మూడు సిరీస్ లు జరగ్గా.. వాటన్నింటినీ కోల్పోయింది టీమిండియా. ఈ రెండు దేశాల పర్యటనల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గగలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+