ఒక మగాడిగా రా- మంచు మనోజ్ సవాల్..!!

Manchu Vishnu: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు తెర మీదికి వచ్చాయి. విభేదాలు భగ్గుమన్నాయి. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి. చివరికి- పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేంత పరిస్థితి తలెత్తింది.

తన భార్య భూమా మౌనిక రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయన కుమారుడు, నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తననూ కొట్టాడంటూ మనోజ్ లిఖిత పూరకంగా పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి ప్రతిగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్‌‌పై ఫిర్యాదు చేశారు. మనోజ్, కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారాయన.

Mohan Babu family disputes Manchu Manoj made strong allegations

ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.

సోమవారం తెల్లవారు జామున కూడా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు వివరించారు. ఉదయం 10: 30 గంటల సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

తనకు భద్రత కల్పించాలంటూ మోహన్ బాబు రాసిన ఈ లేఖపై మంచు విష్ణు స్పందించారు. జల్‌పల్లిలో గల తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదని, ఇది ఆత్మగౌరవానికి, భార్య పిల్లల భద్రతకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు.

ఒక మగాడిగా వచ్చి నేరుగా తన వద్దకు వచ్చి, తనను ఏం చేసినా ఫర్వాలేదని, భార్య మీదికి వెళ్లడం సరికాదని మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికి భార్య, పిల్లలను తీసుకొస్తున్నారని విమర్శించారు. భార్య, పిల్లలు ఇంట్లో ఉండగా అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.

తనకు, తన భార్య పిల్లలకు భద్రత కల్పించాలని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశానని, అయినా వాళ్లు కూడా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. ఎస్ఐ స్వయంగా వచ్చి తనకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు అడ్డం తిరిగారని అన్నారు.

కానిస్టేబుళ్లు ఇంటికి వచ్చి తన మనుషులు, బౌన్సర్లను భయపెట్టారని, వేరే బాడీ గార్డులను ఇంట్లోకి పంపించారని మంచు మనోజ్ అన్నారు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని ఆయన నిలదీశారు. తనకు వ్యక్తిగతంగా భద్రత కల్పిస్తోన్న మనుషులను వెనక్కి పంపించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+