Weather: తెలంగాణలో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ పూర్తిగా విస్తరిస్తుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.గత రెండు రోజులుగా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో నగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా, మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అశ్వాపురంలో అత్యధిక వర్షపాతం

అశ్వాపురంలో అత్యధిక వర్షపాతం

మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా మంచిప్పలో అల్పంగా 6.6 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో భారీ వర్షాలు

మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 604 సెంటిమీటర్ల వర్షం పడగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరెడ్ మెంట్‌లో 5.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, బుధవారం కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నగర ప్రజలు బయటికి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది.

మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, వనపర్తి, నారాయణ పేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భద్రాది కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+