బిగ్ న్యూస్.. చర్లపల్లికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రానుందహో.. !!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగబోతోంది. ఫిబ్రవరి తొలి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వార్డులు, చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లను ఖరారయ్యాయి. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బీసీ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లను నిర్ధారించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం- 2019 ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేశారు.

ఈ పరిణామాల మధ్య రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు తీపి కబురు వినిపించింది. హైదరాబాద్ కు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు, కేరళకూ వీటిని కేటాయించింది. ఆయా రాష్ట్రాల్లోని నగరాల మీదుగా మొత్తం మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టబోతోన్నాయి. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాన్ని అందించనున్నాయి.

MoR Grants Green Light for 3 new Amrit Bharat Trains Charlapalli to Thiruvananthapuram Among Them

1. నాగర్‌కోయిల్ - మంగళూరు: నాగర్ కోయిల్ నుంచి బయలుదేరే కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ తిరువనంతపురం, వర్కల, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్ గాడ్ మీదుగా మంగళూరుకు చేరుకుంటుంది.

2. తాంబరం - తిరువనంతపురం: చెన్నై తాంబరం నుంచి బయలుదేరే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ చెంగల్పట్టు, విల్లుపురం, విరుధాచలం, అరియలూరు, శ్రీరంగం, తిరుచ్చి, దిండిగల్, మధురై, విరుధునగర్, కోయిల్ పట్టి, సత్తూరు, తిరునెల్వేలి, వల్లియూరు, నాగర్ కోయిల్, కుళిథురై మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది.

3. చర్లపల్లి- తిరువనంతపురం: చర్లపల్లి నుంచి బయలుదేరే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, ఎర్నాకుళం, కొట్టాయం, కొల్లం మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది. ఆయా రైళ్ల రూట్లు, స్టేషన్లు ఖరారు అయ్యాయే గానీ, టైమింగ్, ఛార్జీలు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఫిబ్రవరి మొదటివారంలో ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+