మేం సెక్స్ కోసం.. మీవాళ్లు డబ్బు కోసం: షేక్ చెప్పినట్లే?, పాతబస్తీలో ఖాజీ రఫియా లీలలు

వారికి అంత నమ్మకంగా వ్యవహరిస్తూ ఏళ్లుగా రఫియా ఈ బాగోతాన్ని నడుపుతున్నాడు.

హైదరాబాద్: 'మీవాళ్లంతా డబ్బు కోసం పాకులాడుతుంటారు. అందుకోసం ఏమైనా చేస్తారు.. మేమలా కాదు.. మేం సెక్స్ కోసం ఏదైనా చేస్తాం' పాతబస్తీలో పట్టుబడిన ఓ అరబ్ షేక్ ఇటీవల పోలీసుల విచారణలో వెల్లడించిన విషయమిది.

పాతబస్తీకి చెందిన గ్రేటర్‌ చీఫ్‌ ఖాజీ రఫియా లీలలు చూస్తుంటే ఈ మాట నిజమే అనిపించకమానదు. డబ్బుకు కక్కుర్తిపడి ఎంతోమంది అమాయక బాలికల జీవితాలను నాశనం చేశాడు. పేదరికాన్ని, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

మత పెద్ద ముసుగులో:

మత పెద్ద ముసుగులో:

పైకి మత పెద్ద ముసుగులో కనిపించే ఖాజీ.. చేసేవి మాత్రమే అసాంఘీక కార్యకలాపాలే. సౌదీ నుంచి పెళ్లిళ్ల కోసం పాతబస్తీకి వచ్చే ఎంతోమంది షేక్ లు ఖాజీ ద్వారానే వివాహాలు చేసుకున్నారు. ఈ తరహా పెళ్లిళ్లను కుదర్చడంలో ఖాజీ ఓ బ్రాండ్ గా మారిపోయాడు.

Recommended Video

    Hyderabad marriage racket : 8 Arab sheikhs arrested మోజు తీరాక, అరబ్ దేశాల్లో యువతుల నరకం| Oneindia
    ఇదీ ట్రాక్ రికార్డు:

    ఇదీ ట్రాక్ రికార్డు:

    ఇదీ ట్రాక్ రికార్డు:

    ఖాజీ ఇప్పటివరకు 1000 ఒప్పంద వివాహాలు జరిపించాడంటే.. ఈ వ్యవహారంలో అతనెంత మునిగితేలాడో అర్థం చేసుకోవచ్చు. అరబ్బు షేకులెవరికైన కొత్త పెళ్లాం కావాలనిపిస్తే తొలుత సంప్రదించేది ఖాజీ రఫియానే. తన ఏజెంట్ల ద్వారా పాతబస్తీలో ఉండే పేద కుటుంబాలకు గాలం వేసి.. వారి కుటుంబాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చేవాడు.

    ఏజెంట్లను దించి:

    పాతబస్తీల్లో అందంగా ఉండే అమ్మాయిల వివరాలు సంపాదించడం, వాటిని ఖాజీ రఫియాకు చేరవేయడమే ఏజెంట్ల పని. అంతేకాదు, యువతుల తల్లిదండ్రులకు ప్రలోభాలతో నచ్చజెప్పుతారు. గతంలో షేక్ లను పెళ్లి చేసుకున్నవారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, డబ్బుకు లోటు ఉండదని నమ్మబలుకుతారు.

    ఏజెంట్ల మాటలకు గనుక యువతుల కుటుంబాలు లొంగకపోతే.. అవసరమైతే వారి బంధువులను రంగంలోకి దించుతారు. నయానో.. భయానో.. వారు ఓకె అనేలా చేస్తారు. సదరు కుటుంబం ఓకె అనడమే ఆలస్యం.. కొత్త పెళ్లి కూతురు కోసం సౌదీ నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టే షేక్ కు కబురు వెళ్తుంది. ఆపై షేక్ నగరానికి చేరుకోగానే ఖాజీ రఫియా అతన్ని దగ్గరుండి రిసీవ్ చేసుకుని, తన లాడ్జికి తీసుకెళ్తాడు.

    లాడ్జిలోనే పెళ్లి, వసతులు:

    లాడ్జిలోనే పెళ్లి, వసతులు:

    లాడ్జిలోనే కొత్త పెళ్లి కూతురితో నిఖా, అక్కడే కొద్ది రోజులు మకాం ఏర్పాటు చేస్తాడు. ఒక్క రోజుకు రూ.5000 వసూలు చేస్తాడు. పెళ్లి కోసం రూ.5లక్షలు వసూలు చేస్తాడు. ఇందులో నుంచి యువతి తల్లిదండ్రులకు ముట్టేది కేవలం రూ.70వేలు మాత్రమే. ఏజెంట్ కు 2,50,000 ముట్టుజెప్పుతాడు. ఇక మిగిలిన డబ్బంతా ఖాజీ జేబులోకే.

    ముంబైలోను కొనసాగుతుందన్న అనుమానాలు:

    ముంబైలోను కొనసాగుతుందన్న అనుమానాలు:

    చాలామంది అరబ్ షేక్ లతో ఖాజీ రఫియాకు పరిచయాలున్నాయి. ముఖ్యంగా కొత్త పెళ్లి కూతురు కావాలంటే రఫియానే సంప్రదించాలని చాలామంది షేక్ లు భావిస్తుంటారు. వారికి అంత నమ్మకంగా వ్యవహరిస్తూ ఏళ్లుగా రఫియా ఈ బాగోతాన్ని నడుపుతున్నాడు. అలా ఇప్పటివరకు 1000పెళ్లిళ్లు జరిపించినట్లుగా గుర్తించారు. అయితే ఇది కేవలం పాతబస్తీ హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాలేదని, ముంబైలోను ఈ దందా కొనసాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+