Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఛీ.. కన్నతల్లేనా?: వ్యభిచారం చేయమని వేధింపులు, పోలీసులనాశ్రయించిన కుమార్తె

కన్నతల్లి పదానికే కళంకం తెచ్చిందో మహిళ. తన కుమార్తెను వ్యభిచారం చేయమని వేధింపులకు గురిచేస్తోంది. కన్న తల్లి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించిందా కూతురు.

హైదరాబాద్: కన్నతల్లి పదానికే కళంకం తెచ్చిందో మహిళ. తన కుమార్తెను వ్యభిచారం చేయమని వేధింపులకు గురిచేస్తోంది. కన్న తల్లి వేధింపులు అధికం కావడంతో భరించలేక పోలీసులను ఆశ్రయించిందా కూతురు.

హైదరాబాదు శివార్లలోని ఘట్‌ కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఘట్ కేసర్ పరిధిలోని ఎన్‌ఎఫ్సీ నగర్‌ లోని భార్యాభర్తల విభేదాల కారణంగా కుమార్తె (17) తో కలిసి ఉంటోంది ఓ మహిళ.

Mother forcing her own daughter to become a prostitute

స్థానికంగా ఉన్న మరోవ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ గత కొంత కాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు.

దీంతో విసిగిపోయిన కుమార్తె ఈ దారుణాన్ని కన్నతల్లికి వివరించింది. కూతుర్ని కాపాడాల్సింది పోయి, అతడికి సహకరించాలంటూ స్వయంగా తల్లే మందలించింది. అతను చెప్పినట్టు వింటే డబ్బులిస్తాడని, జీవితం బాగుంటుందని చెప్పింది.

చివరికి కన్నతల్లే వ్యభిచారానికి ఒప్పుకోమంటూ వేధిస్తుండడంతో ఆ కూతురు తల్లి చెరనుంచి బయటపడి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. దీంతో 'నువ్వు తిరిగి రాకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా.. నువ్వు చెడ్డదానివని, ఎంతో మందితో నీకు అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తా..'అంటూ ఆ తల్లి కూతుర్నే బెదిరించసాగింది.

దీంతో కన్నతల్లి ఆగడాలు భరించలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+